
హీరో నవీన్ చంద్ర (Naveen Chandra)..తెలుగు, తమిళ సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు పొందారు. తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్లో వచ్చిన అందాల రాక్షసి మూవీతో ఎంట్రీ ఇచ్చి..సూర్య అనే పాత్రలో ఒదిగిపోయాడు. అతని ఫెరఫార్మన్స్కు ఫిదా కానీ మ్యూజిక్ లవర్ ఉండడు. దళం, త్రిపుర లాంటి సినిమాల్లో కథానాయకుడిగా నటించి మంచి మార్కులే కొట్టేసాడు.
ఆ తర్వాత నవీన్ నుంచి వచ్చిన మూవీస్..ఆడియన్స్ కు సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడంతో..హీరోగా డీలా పడిపోయాడు. ఇక నవీన్..హీరోగానూ, విలన్ గాను..కుదిరితే ఎటువంటి క్యారెక్టర్ లో అయిన..కనిపించడానికి రెడీ అయ్యాడు. నాని హీరోగా వచ్చిన నేను లోకల్ సినిమాలో విలన్గా పోలీసు క్యారెక్టర్లో నటించి మెప్పించాడు.
ఇక ఎన్టీఆర్ హీరోగా వచ్చిన అరవింద సమెత మూవీతో తనలోని యాంగ్రీ యాక్టర్ను, పూర్తి స్థాయి విలన్ను పరిచయం చేసుకున్నాడు. ఇక వెనక్కి చూసుకోకుండా..పరంపర, విరాట పర్వం, మంత్ అఫ్ మధు వంటి సినిమాలతో ఆడియాన్స్కు గుర్తుండిపోయేలా నటిస్తున్నాడు. అంతేకాకుండా తమిళ భాషలోనూ నవీన్ తన సత్తా చాటుతున్నాడు.
ఇపుడు లేటెస్ట్గా థియేటర్లో దూసుకెళ్తున్న..తమిళ మూవీ ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ మూవీలో నవీన్ ప్రధాన పాత్ర పోషించాడు. రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య వంటి స్టార్స్కి ధీటుగా..నవీన్ చంద్ర యాక్టింగ్ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. క్రూరుడైన డీఎస్పీ పాత్రలో నవీన్ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటన అదిరిపోయాయి అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ముఖ్యంగా జిగర్ తండ క్లైమాక్స్లో నవీన్ క్యారెక్టర్ పీక్ లెవెల్లో ఉందంటూ తమిళ ప్రేక్షకులు మన తెలుగువాడికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం తమిళ సినిమాల్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా మారిన నవీన్ చంద్రకు..తెలుగు ఫ్యాన్స్ సూపర్ బ్రో..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఎందుకంటే, ఇన్నాళ్లు మన తెలుగు డైరెక్టర్స్ కి..తమిళ యాక్టర్స్ దొరికేవాళ్లు..ఇప్పుడు తమిళ మేకర్స్ కి మన తెలుగు హీరో దొరికాడు. అది కదా మన తెలుగోడి సత్తా అంటే..సినిమా ప్యాషన్ అంటే.
ఇంకో గొప్ప విషయం చెప్పాలంటే జిగర్ తండ డబుల్ ఎక్స్ లో నవీన్ చంద్ర తన వాయిస్ తోనే సొంత డబ్బింగ్ కూడా చెప్పడం మామూలు విషయం కాదు. ఇదంతా మన తెలుగోడికి..సినిమా అంటే ప్యాషన్ ఏంటో నిరూపిస్తోంది. నవీన్ చంద్ర గేమ్ ఛేంజర్ మూవీలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.