Nikhil Siddhartha: తండ్రైన యంగ్ హీరో నిఖిల్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య పల్లవి

Nikhil Siddhartha: తండ్రైన యంగ్ హీరో నిఖిల్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య పల్లవి

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ (Nikhil Siddhartha) తండ్రయ్యారు. నిఖిల్ సతీమణి పల్లవి ఈ రోజు (ఫిబ్రవరి 21న) ఉదయం పండండి మగ బిడ్డకు జన్మనిచ్చింది. నిఖిల్ తన కుమారుడిని ఎత్తుకుని..ప్రేమతో ముద్దాడుతున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిఖిల్ దంపతులు పేరేంట్స్ కావడంతో ఫ్యాన్స్ ,సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020లో నిఖిల్, పల్లవిని ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

నిఖిల్ సిద్ధార్థ కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా  స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నారు. ఈ మూవీ సక్సెస్ తో నిఖిల్ దశ తిరిగింది. బడా నిర్మాతలు ఈ కుర్ర హీరోతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో నిఖిల్ పాన్ ఇండియా సినిమాలను లైన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం స్వయంభూ అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని చేస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం  తీవ్ర కసరత్తులు చేస్తున్నారు.