సలార్ విలన్తో ప్రభాస్ మూవీ.. లూసిఫర్ రిజల్ట్ రిపీట్ కానుందా?

సలార్ విలన్తో ప్రభాస్ మూవీ.. లూసిఫర్ రిజల్ట్ రిపీట్ కానుందా?

గ్లోబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్(Prashanth neel) డైరెక్షన్లో సలార్(Salaar) మూవీ చేస్తున్న సంగంతి తెలిసిందే. ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్(Nag Ashwin) తో కల్కి 2898 AD(Kalki 2898 AD) సినిమా చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

అయితే ఈ రెండు సినిమాల తరువాత ప్రభాస్ చేయబోయే సినిమాల గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ప్రభాస్ మలయాళ నటుడు, దర్శకుడు పృద్విరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) తో ఒక సినిమా చేయనున్నారట. ప్రస్తుతం పృద్విరాజ్ సుకుమారన్ ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ సినిమాలో విలన్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో పృద్విరాజ్ ప్రభాస్ కు అదిరిపోయే కథను చెప్పారట. గ్యాంగ్ స్టార్ నేపధ్యంలో సాగే ఈ కథ ప్రభాస్ కు కూడా బాగా నచ్చిందట. కానీ ఈ ప్రాజెక్టు విషయంలో క్లారిటీ ఇవ్వలేదట ప్రభాస్. 

ఒకవేళ ప్రభాస్ ఒకే అంటే జస్ట్ ఆరు నెలల్లో ఈ సినిమాను ఫినిష్ చేయాలని ఫిక్స్ అయ్యాడట పృద్విరాజ్ సుకుమారన్. లూసిఫర్(Lucifer) రేంజ్ లో ప్రభాస్ ఎలివేషన్స్ ప్లాన్ చేసి ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారట పృద్విరాజ్. ఇక ఈ న్యూస్ తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ప్రభాసన్నా పృద్విరాజ్ తో సినిమా చేయన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకు ప్రభాస్ ఒకే చెప్తారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.