
టాలీవుడ్ లో యాంగ్రీ మ్యాన్ గా పేరుతెచ్చుకున్న హీరో రాజశేఖర్(Rajashekhar). ఒకప్పుడు వరుస విజయాలు సాధించి ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఎదిగారు. అయితే కొంతకాలంగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టారు. ఇందులో ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఎక్‌ట్రా ఆర్డనరీమ్యాన్(Extra OrdinaryMan). యూత్ స్టార్ నితిన్(Nithin) హీరోగా వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ రైటర్ వక్కంతం వంశీ(Vakkantham Vamshi) తెరకెక్కిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డిసెంబర్ 4న ఎక్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు చిత్ర యూనిట్ హాజరయ్యారు. ఇందులో భాగంగా నటుడు రాజశేఖర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఇటీవల రిలీజైన ఎక్‌ట్రా ఆర్డనరీ మ్యాన్ ట్రైలర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఆ ట్రైలర్ లో చివర్లో రాజశేఖర్ చెప్పిన.. నాకు జీవిత, జీవితం రెండూ ఒక్కటే.. అనే డైలాగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజశేఖర్ నిజజీవితంలో కూడా అలానే ఉంటారని అందరు అనుకుంటారు.
ఇదే విషయంపై స్పందించారు రాజశేఖర్.. సినిమాలో నాకు జీవిత, జీవితం రెండూ ఒకటే అనే డైలాగ్ వక్కంతం వంశీ గారు రాశారు. ఆయనకు ఆ ఐడియా ఎలా వచ్చిందో తెలియదు కానీ.. బాగా వైరల్ అయింది. జీవిత ఎం చెప్తే అది నేను చేస్తాను అనే ఉద్దేశంతో వంశీ ఈ డైలాగ్ రాసినట్టున్నాడు. నిజానికి నేను చెప్పిందే జీవిత వింటుంది. తను చాలా మంచిది.. తిరిగి ఒక్క మాట కూడా అనదు. బయట మాత్రం జీవిత చెప్తేనే నేను వింటాను అని అనుకుంటున్నారు. నిజానికి జీవిత చెప్పింది కూడా నేను వింటాను ఎందుకంటే.. ఆమె ఎం చెప్పినా నా మంచి కోసమే కదా.. అంటూ చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు రాజశేఖర్.