
హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‍డమ్’ (KINGDOM). భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడికల్ థ్రిల్లర్ మూవీపై భారీ అంచనాలున్నాయి.
అందుకు తగ్గట్టుగానే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. ఈ సినిమా మే 30న విడుదలకు సిద్దమవుతుంది. ఈక్రమంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ‘కింగ్‍డమ్’ నుంచి వినిపిస్తోంది.
‘కింగ్‍డమ్’ సినిమాలో టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. ఇప్పటికే, ఈ హీరో గెస్ట్ రోల్లో నటిస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పుడు తన పాత్ర ఎలా ఉండబోతుందనేది వైరల్గా మారింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ అన్నగా పాత్రలో సత్యదేవ్ కనిపిస్తున్నాడట. చాలా కీలక సమయంలో వచ్చే ఆ పాత్ర సినిమాకు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందట. ఇందులో సత్యదేవ్ ఒక తెగకు సంబంధించిన నాయకుడిగా కనిపించనున్నారట.
ఈ పాత్ర సినిమాకు మంచి ప్లస్ అయ్యేలా డైరెక్టర్ గౌతమ్ డిజైన్ చేశాడట. అంతేకాకుండా స్క్రీన్ పై సత్యదేవ్ పాత్ర పరిధి ఎక్కువేనట. విజయ్-సత్యదేవ్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంటాయని కూడా టాక్ వినిపిస్తోంది. ఇపుడీ ఈ వార్త వైరల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇద్దరు ఇంటెన్స్ ఉన్న యాక్టర్స్ను ఒకే ఫ్రేమ్లో చూడబోతున్నాం అంటూ ఇరువురి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ క్రమంలోనే కింగ్డమ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుధ్కు తన నెక్స్ట్ సినిమాల గురించి సంబంధించిన ఓ ప్రశ్న ఎదురైంది.
►ALSO READ | Single Censor Review: ‘సింగిల్’ సెన్సార్ రివ్యూ.. శ్రీవిష్ణు మూవీకి టాక్ ఎలా ఉందంటే?
' కింగ్డమ్ చివరి 40నిమిషాల మూవీని చూశానని..అద్భుతంగా ఉందని.. విజయ్ దేవరకొండ పెర్ఫామెన్స్ అరాచకం..ముఖ్యంగా యాక్షన్ సీన్స్ సూపర్బ్ అని' అనిరుధ్ చెప్పుకొచ్చాడు. ఈ క్రేజీ అప్డేట్స్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
సత్యదేవ్ విషయానికి వస్తే.. టాలీవుడ్ టాలెంటెడ్ నటుడిగా సత్య దేవ్ మంచి గుర్తింపు పొందాడు. చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నాడు. ముందుగా చిన్న చిన్న పాత్రలతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. తరువాత సోలో హీరోగా మారాడు. హీరోగా నటిస్తూనే, పలు కీలక పాత్రలు పోషిస్తూ సినిమాల్లో రాణిస్తున్నాడు.
ఇకపోతే, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కింగ్‍డమ్ సినిమాను హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నారు. మే 30న తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ రిలీజ్ కానుంది.