Sharwanand 36: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వా 36..జ‌కార్తా ట్రాక్పై కళ్లు చెదిరే బైక్ రేసింగ్!

Sharwanand 36: స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో శర్వా 36..జ‌కార్తా ట్రాక్పై కళ్లు చెదిరే బైక్ రేసింగ్!

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్ శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే మనం సినిమాతో ఆడియన్స్ ను అలరించిన శర్వా..తన 36వ సినిమా కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం లూజర్ వెబ్ సీరీస్తో మంచి పేరు తెచ్చుకున్న డైరెక్టర్ అభిలాష్ రెడ్డి (Abilashreddy)తో తన 36వ  సినిమా చేస్తున్నాడు.ఈ మూవీ స్పోర్ట్స్ బేస్డ్ గా ఉండబోతోంది. ఇందులో బైక్ రైడర్ గా శర్వా కనిపించబోతున్నారు. 

తాజా విషయానికి వస్తే..ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇండోనేషియ రాజ‌ధాని జ‌క‌ర్తాలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. జ‌కార్తా ట్రాక్లో శ‌ర్వానంద్పై బైక్ రేసింగ్ యాక్ష‌న్ సీన్స్ను చిత్రీక‌రిస్తున్నారు మేకర్స్. ఈ సీక్వెన్స్ ను దిలీప్ మాస్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో షూట్ చేస్తున్నారు.ఇకపోతే ఆగ‌స్టు సెకండ్ వీక్ వ‌ర‌కూ అక్క‌డే షూటింగ్ ఉంటుంద‌ని స‌మాచారం.

ఈ మూవీలో ఈ బైక్ రేస్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయని యూనిట్ సభ్యుల నుంచి ధీమా వ్య‌క్తం అవుతోంది. అయితే, ఇంత వ‌ర‌కూ శ‌ర్వా ఇలాంటి స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. కాకపోతే, గతంలో మ‌ళ్లీ మళ్లీ రాని రోజు మూవీలో మాత్రం ర‌న్న‌ర్ గా కనిపించాడు. రీసెంట్గా S36 నుంచి ఓ ఆసక్తికరమైన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో మురికి రహదారిపై రేసులో బైక్ రైడర్‌లను..అధిగమించేందుకు ఎత్తుగా ఎగురుతున్న రైడర్ జాకెట్‌పై S36 ట్యాగ్ చూపించగా అది ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంది. 

ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్ నటిస్తుంది. అంతేకాదు..అపుడే ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం.యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోన్నఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

మరోవైపు, శర్వానంద్ మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్గా హీరో శ్రీవిష్ణుకు సామజవరగమన వంటి బ్యూటిఫుల్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు(Ram Abbara)తో సినిమా చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీని బడా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.