హీరో సిద్ధార్ధ్ ను అవమానించిన ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? : నా సినిమాలు ఎవరు చూస్తారని అడుగుతున్నారు..

హీరో సిద్ధార్ధ్ ను అవమానించిన ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు? : నా సినిమాలు ఎవరు చూస్తారని అడుగుతున్నారు..

హీరో సిద్ధార్థ్‌ ( Siddharth) లేటెస్ట్ తమిళ మూవీ చిత్తా(Chithha). తండ్రి, కూతురు కథతో వచ్చిన ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎమోషనల్ గా ఆకట్టుకుంటోంది. ఈ మూవీ (సెప్టెంబర్ 28న) తమిళంలో రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాని తెలుగులో చిన్నా(Chinna) టైటిల్ తో అక్టోబర్ 6న రిలీజ్ చేస్తున్నారు. కూతురితో హ్యాపీ గా గడిపే ఫ్యామిలీలో..ఒక్కసారిగా ఆ పాప తప్పిపోతే ..ఎదురైనా సంఘటనల నేపథ్యంతో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది.  

అక్టోబర్ 3న మంగళవారం హైదరాబాద్ లో చిన్నా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. సిద్ధార్ధ్ మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. సిద్ధార్ధ్ అనే నేను.. ఇంకా ఇండస్ట్రీలో ఎందుకు ఉన్నానో తెలిపే అద్భుతమైన చిత్రం చిన్నా అన్నారు. ఈ మూవీ టైటిల్ 'చిన్నా' అనగా..అన్నయ్య కూతురితో చిన్నాన్న కు ఉండే అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించాం. అందుకే ఈ టైటిల్ తో వస్తున్నాం. నాకు ఈ సినిమా తీయడానికి 22 సంవత్సరాలు పట్టిందని మణిరత్నం గారితో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

చిన్నా మూవీని తెలుగులో రిలీజ్ చేయటానికి చాలా కష్టపడుతున్నట్లు చెప్పుకొచ్చాడు హీరో సిద్దార్థ్. ఇంకా సిద్ధార్థ్ సినిమాలు జనం చూస్తున్నారా అంటూ ఓ పెద్ద వ్యక్తి కామెంట్ చేయటం.. అతను పెద్ద డిస్ట్రిబ్యూటర్ కావటం చూస్తుంటే.. చిన్నా సినిమాకు ఎలాంటి ఆదరణ ఉందో అర్థం అవుతుందన్నారు. కన్నడ వాళ్లు వెళ్లిపొమ్మని అన్నారని.. తెలుగోళ్లు మాత్రం ధియేటర్లే ఇవ్వటం లేదన్నారు. 

ALSO READ: ఎన్టీఆర్ చేతుల మీదుగా మ్యాడ్ ట్రైలర్.. నవ్వులతో మరో హ్యాపీడేస్ 

సిద్ధార్థ్ సినిమాలను ఇంకా చూస్తున్నారా అంటూ ఎగతాళిగా మాట్లాడిన వాళ్లకు.. సినిమా రిలీజ్ తర్వాత.. నేను ఏంటో.. నా సినిమా ఏంటో తెలుస్తుందంటూ చురకలు అంటించారు. సిద్ధార్థ్ చేసిన ఈ కామెంట్స్.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవర్ని ఉద్దేశించి అన్నారు అనే చర్చ నడుస్తుంది. పెద్ద డిస్ట్రిబ్యూటర్లు నలుగురు, ఐదుగురు మాత్రమే ఉన్నారు.. వాళ్ల చేతుల్లోనే ధియేటర్లు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. ఇంత నోటి దురుసుగా మాట్లాడిన ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు అనేది ఇప్పుడు హాట్ డిస్కషన్ అయ్యింది.

పదేళ్లల్లో కేవలం మూడు సినిమాలు మాత్రమే సిద్ధార్థ్ చేశాడు.. బొమ్మరిల్లు తర్వాత సరైన హిట్ లేదు.. తమిళంలో అయితే రెగ్యులర్ గా సినిమాలు చేస్తున్నాడు సిద్దార్థ్.. హీరోగా గుర్తింపు ఉన్న సిద్ధార్థ్ సినిమాను.. సిద్థార్థ్ ను అంత మాట అన్న డిస్ట్రిబ్యూటర్ అంశం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.

ఏది ఏమైనా డబ్బులు బాస్ డబ్బులు.. సినిమా ఇండస్ట్రీకి కావాల్సింది మంచి సినిమానా.. చెడ్డ సినిమానా అన్నది కాదు.. చిన్నదా.. పెద్దదా అన్నది కూడా పాయింట్.. డబ్బు.. మనీ.. అలా వ్యవహరించే అతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడి ఉండొచ్చని గుసగుసలాడుకుంటున్నారు సినీ జనం...