శింబు కోసం కమల్ రిస్క్.. ఇదంతా ఎందుకోసం?

శింబు కోసం కమల్ రిస్క్.. ఇదంతా ఎందుకోసం?

తమిళ స్టార్ హీరో, లోకనాయకుడు కమల్ హసన్ మరో కొత్త సినిమాను ప్రారంబించాడు. అయితే హీరోగా కాదు నిర్మాతగా. ఈ సినిమాలో స్టార్ హీరో శింబు  హీరోగా నటిస్తున్నాడు. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో పీరియాడిక్ డ్రామాగా తెరకేక్కనున్న ఈ సినిమాకు దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను మే 22 సోమవారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు మేకర్స్. 

దీనికి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. పాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు.. భారతీయ దిగ్గజ సంగీత దర్శకుడు ఏ ఆర్ రహమాన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా బాలీవుడ్ బ్యూటీ దీపికను అనుకున్నారు మేకర్స్. కానీ ఆమె రెమ్యునరేషన్ ఎక్కువ డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ లో మహానటి కీర్తి సురేష్ ను ఫైనల్ చేసారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. 

వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా.. జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా కోసం శింబు కూడా చాలానే కష్టపడుతున్నాడు. తన బాడీని ఫుల్ గా ట్రాన్స్ఫాం చేసుకున్నాడు. మరి శింబు కేరిర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో రానున్న ఈ సినిమా ఏ రేంజ్ విజయం సాదిస్తుందో తెలియాలంటే 2024 వరకు ఆగాల్సిందే.