
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో సినీ సెలబ్రెటీలు వరుసగా పెళ్ళిబాట పడుతున్నారు. ఇటీవలే మెగా ఫ్యామిలీ నుండి వరుణ్ తేజ్(Varun tej), లావణ్య(Lavanya) పెళ్లి జరగగా.. ఈమధ్యే దగ్గుబాటి వారసుడు సురేష్ బాబు కొడుకు అభిరామ్(Abhiram) పెళ్లి కూడా జరిగింది. ఇక తాజాగా మరో హీరో కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అనే న్యూస్ వైరల్ అవుతోంది. ఆ హీరో మరెవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుమారుడు శ్రీసింహ. పెళ్లికూతురు మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ హీరో మురళీమోహన్ మనవరాలు.
ఇదే విషయాన్నీ స్వయంగా మురళీమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి మురళీమోహన్ మాట్లాడుతూ.. నాకు ఇద్దరు సంతానం. ఒక కూతురు, ఒక కొడుకు. కూతురు, అల్లుడు విదేశాల్లో సెటిలయ్యారు. వారికి ఒక అమ్మాయి. ఆమె వివాహం ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లో ఘనంగా జరగనుంది. అలాగే నా కొడుక్కి ఓ కూతురు. ఆమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైంది. బయట వినిపిస్తున్న వార్తల ప్రకారమే కీరవాణి ఇంటికి ఆమె కోడలిగా వెళ్లనుంది. ఈ పెళ్లి వచ్చే ఏడాది చివర్లో జరగనుంది.. అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మురళీమోహన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక శ్రీసింహా విషయానికి వస్తే.. ఇటీవలే ఆయన హీరోగా వచ్చిన భాగ్ సాలె సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ.. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేదు. ఇటీవలే మరో సినిమాను మొదలుపెట్టారు శ్రీసింహ. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.