కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని: హీరో సూర్య

కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని: హీరో సూర్య

ప్రముఖ కోలీవుడ్ నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్(Vijayakanth) ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న విషయం తెలిసిందే. అనారోగ్య కారణాల వాళ్ళ కొంతకాలంగా ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త కుదుటపడుతుందని ఆయన సతీమణి వీడియో ద్వారా తెలిపారు. అంతేకాదు ఇందులో భాగంగా విజయకాంత్ ప్రస్తుతం ఫోటోను కూడా ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న రూమర్స్ కి చెక్ పడింది.  

తాజాగా విజయకాంత్ ఆరోగ్యం పరిస్థిపై ట్వీట్ చేశారు తమిళ స్టార్ హీరో సూర్య.. మా అన్న విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థిస్తున్న కోట్లాది గుండెల్లో నేనూ ఒకడిని. వారి ప్రార్థనలు కూడా తప్పకుండా నెరవేరుతాయి. అవే ఆయన్ని త్వరగా కోలుకునేలా చేస్తాయి.. అంటూ రాసుకొచ్చారు సూర్య. ప్రస్తుతం సూర్య చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక సూర్య సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు శివతో కంగువా అనే సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరికొత్త అవతారంలో కనిపించున్నారు. ఇప్పటికే సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.