ఘనంగా వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా?

ఘనంగా వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం.. వరుడు ఎవరో తెలుసా?

దగ్గుబాటి(Daggubati) వారింట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేశ్‌(Victory Venkatesh)- నీరజ(Neeraja)ల రెండో కూతురు హవ్యవాహిని(havyavahini) పెళ్లి పీటలెక్కనుంది. ఈమేరకు బుధవారం(అక్టోబర్ 25) రాత్రి హవ్యవాహిని నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. విజయవాడకు చెందిన డాక్టర్‌ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నారని సమాచారం. 

Also Read :- అనారోగ్యం కారణంగానే సినిమాలకు దూరం

ఈ నిశ్చితార్థ వేడుకకు టాలీవుడ్ నుండి మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సహా పలువురు పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.