
ఆనంద్ దేవరకొండ(Anand devarakonda) హీరోగా వచ్చిన బేబీ(Baby) సినిమాలో అది నా పిల్లరా అనే డైలాగ్ వైరల్‌గా మారింది. గతంలో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) అర్జున్ రెడ్డి(Arjun reddy) సినిమాలోనూ ఈ డైలాగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో నెట్టింట ఈ రెండు సీన్లపై వస్తున్న మీమ్స్‌పై విజయ్ స్పందించాడు. ఆ డైలాగ్ ఓ ఎమోషన్ అంటూ లవ్ సింబల్‌ను అటాచ్ చేశాడు.
ఇక ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన బేబీ సినిమా థియేట్రికల్ రన్ ముగించుకొని ఆగస్టు 25న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha)లో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మేరకు బేబీ సినిమాలో అది నా పిల్ల అనే డైలాగ్ ఫుల్ వైరల్ అయ్యింది.