Thupparivaalan 2: విశాల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. తుప్పరివాళన్ 2 అప్డేట్ వచ్చేసింది

Thupparivaalan 2: విశాల్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. తుప్పరివాళన్ 2 అప్డేట్ వచ్చేసింది

తమిళ స్టార్ హీరో విశాల్(Vishal) ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ఫుల్ జోష్ ఉన్నారు. ఇటీవల మార్క్ ఆంటోనీ(Mark Antony) సినిమాతో కెరీరి బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో.. ప్రస్తుతం రత్నం(Rathnam) సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. మాస్ చిత్రాల దర్శకుడు హరి(Hari) తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్(Priya Bhavani Shankar) హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజర్, సాంగ్స్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

అయితే.. ఈ సినిమా తరువాత విశాల్ తుప్పరివాళన్(తెలుగులో డిటెక్టీవ్) సినిమాకు సీక్వెల్ గా తుప్పరివాళన్ 2 చేస్తున్న విషయం తెలిసిందే. చాలాకాలం క్రితమే లాంఛనంగా మొదలైన ఈ సినిమా మొన్నట్టివరకు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. తాజాగా ఈ ఇంట్రెస్టింగ్ సీక్వెల్ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 5నుండి మొదలుకానుందట. ఇక్కడ మరో వీశేషం ఏంటంటే.. ఈ సినిమా కోసం మొదటిసారి విశాల్ దర్శకత్వ భాద్యతలు చేపట్టనున్నాడు. ఇక షూటింగ్ మొదలుపెట్టిన ఆరునెల్లల్లోనే అన్ని పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. 

నిజానికి విశాల్ హీరోగా వచ్చిన తుప్పరివాళన్ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. విలక్షణ చిత్రాల దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన ఈ డిటెక్టీవ్  థ్రిల్లర్ మూవీ 2017లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. సరికొత్త కథ, ఆ కథని మిస్కిన్ ప్రెజెంట్ చేసిన విధానానికి ఆడియన్స్ మెస్మరైజ్ అయ్యారు. అందుకే ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. మరి  సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న విశాల్ కొత్త సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనుందో చూడాలి.