‘ఖిలాడీ’ బ్యూటీ డింపుల్ హయాతి ఓ రిపోర్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘రామబాణం’ మూవీ మే 5వ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు చిత్ర యూనిట్. బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఒక్కొక్కరు చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడిగారు.
అందులో ఓ రిపోర్టర్ మాట్లాడుతూ.. ‘ఈ మధ్య డైరెక్టర్లు చాలా మంది హీరోయిన్ల క్యారెక్టర్లను డిఫరెంట్‌గా క్రియేట్ చేస్తున్నారు. కొత్త జానర్లలో చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ కొంచెం వల్గర్‌గా ఉన్నట్టు అనిపిస్తోంది. చూడటానికి ఫ్యామిలీ సినిమాలనే కనిపిస్తోంది కానీ.. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది.?’ అని హీరోయిన్‌ని అడిగారు. దీంతో అసహనానికి గురైన డింపుల్.. ‘వల్గర్ అంటారేంటి? నాకు తెలిసి సినిమాలో ఎక్కడా వల్గర్ సీన్స్ లేవు. కనీసం మేము రిలీజ్ చేసిన గ్లింప్స్ లో కూడా అలాంటివేవీ.
ఇప్పటివరకు రిలీజైన పాటల్లో, పోస్టర్లలో కూడా నేను శుభ్రంగానే ఉన్నాను. మీరు వల్గర్ అంటుంటే నాకు అర్థం కావడం లేదు’ అంటూ అసహనాన్ని వ్యక్తం చేసింది. దీంతో పక్కనే ఉన్న దర్శకుడు శ్రీవాస్ మైక్ తీసుకొని .. ‘ఈ ప్రెస్ మీట్ లో ఆమె వేసుకొన్ని డ్రెస్ చూస్తేనే అర్థమైపోతుంది ఆమె క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో. ఇదొక ఒక ఫ్యామిలీ అండ్ ట్రెడిషనల్ సినిమా. ట్రెడిషనల్‌గా ఉండాలని వెస్టరన్ డ్రెస్‌లు నేను వేసుకోనని సంప్రదాయ దుస్తుల్లోనే ప్రమోషన్స్ వస్తోంది. వీటిని బట్టి సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్ డెప్త్ ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అని కాస్త ఘాటుగానే సమాధానమిచ్చాడు శ్రీవాస్. మిక్కి జె మేయర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకి రానుంది.