కాజల్ కు ఆఫర్లే..ఆఫర్లు..!

కాజల్ కు ఆఫర్లే..ఆఫర్లు..!

రీసెంట్‌‌గా రిలీజైన ‘రణరంగం’లో చాలా చిన్న పాత్ర చేసింది కాజల్. కనిపించింది కాసేపే అయినా డాక్టర్ పాత్రలో స్పెషల్‌‌గా, క్యూట్‌‌గా కనిపించింది. అదే రోజు ఆమె నటించిన ‘కోమాలి’ కూడా విడుదలయ్యింది. ఈ సినిమాలు సక్సెస్ అయ్యాయా, ఫెయిలయ్యాయా అన్నదానితో ఆమెకి సంబంధం లేదు. పట్టించునేంత తీరిక కూడా తనకి లేదు. అన్ని ఆఫర్స్‌‌ ఉన్నాయి మరి. ప్రస్తుతం ‘భారతీయుడు 2’తో పాటు మంచు విష్ణు సినిమా కూడా చేతిలో ఉంది. ఇంగ్లిష్‌లో రూపొందే ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో కూడా వస్తుంది. అయితే ఆమె విష్ణుకి హీరోయిన్‌‌గా కాక చెల్లెలిగా నటిస్తోందని ప్రచారం జరుగుతోంది.

‘అ’ సినిమాకి సీక్వెల్‌‌ తీసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ స్క్రిప్ట్‌‌ వినిపించాడని, ఆమె కూడా ఆసక్తి చూపించిందని, ఇక సైన్ చేయడమే తరువాయి అని అంటున్నారు. అయితే మొదటి భాగంలో రకరకాల కథలు కాకుండా ఒకే కథ ఉంటుందట. విజయ్ సేతుపతి లీడ్‌‌ రోల్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఓ పక్క ఆగకుండా ఇన్ని ఆఫర్లు వస్తుంటే… మరోపక్క వెబ్‌‌ సిరీస్‌‌లో కూడా నటించేం దుకు రెడీ అవుతోందట కాజల్. తన పాత్ర చుట్టూ తిరిగే ఓ మంచి థ్రిల్లర్‌‌ సిరీస్‌ చేయడానికి కమిటయ్యిందట. చూస్తుంటే కాజల్‌‌ డిమాండ్ ఇప్పట్లో తగ్గేలా లేదు.