
సినిమా హీరోయిన్ అంటే అందంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు. కిరణ్ రాథోడ్ని చూస్తే ఇదే నిజమనిపిస్తుంది. ఆకట్టుకునే రూపం, అందమైన మత్తు కళ్లు ఆమె సొంతం. అయినా పరిశ్రమలో పెద్దగా రాణించలేకపోయింది.
తెలుగులో జెమిని, నువ్వులేక నేను లేను, కెవ్వుకేక వంటి సినిమాల్లో నటించింది. చేసినవన్నీ చిన్న పాత్రలే. అవి కూడా ఏమాత్రం గుర్తింపునివ్వలేదు. ఇందుకు కారణం తన ప్రేమ వ్యవహారమే అంటూ కిరణ్ తాజాగా తెలిపింది. తాను గతంలో ఓ వ్యక్తిని ప్రేమించానని.. తన జీవితంలోకి అతడు రాకుండా ఉండి ఉంటే ఇప్పుడు తన కెరీర్ మరోలా ఉండేదంటూ చెప్పుకొచ్చింది.
కొందరు కావాలనే తనను వెనక్కి లాగే ప్రయత్నం చేసినట్టుగా తెలిపింది. ఇప్పుడు కోలీవుడ్లో లియో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు వివరించింది. మరి ఇకనైనా ఈ బ్యూటీకి మంచి రోజులు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.