స్టార్ హీరోస్తో జతకడితేనే.. మాళవికా షాకింగ్ కామెంట్స్

స్టార్ హీరోస్తో జతకడితేనే.. మాళవికా షాకింగ్ కామెంట్స్

కేరళ బ్యూటీ మాళవికా మోహన్(Malavika mohan) స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. వారితో నటిస్తేనే తమకు ఫ్యూచర్.. లేదంటే అంటే అంతే అంటూ తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది. తాజాగా ఆమె విక్రమ్(Vikram) హీరోగా వస్తన్న తంగలాన్(Thangalaan) సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఇటీవలే షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది. పా.రంజిత్(Pa.Ranjith) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇక రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాళవికా.. తన మనసులో మాటను బయటపెట్టేసింది. స్టార్ హీరోలపై తన అభిప్రాయాన్ని మొహమాటం లేకుండా చెప్పేసింది. ఈ ఇంటర్వ్యూలో మాళవికా మాట్లాడుతూ.. "కొత్తగా వచ్చిన ఏ హీరోయిన్ అయినా ఇండస్ట్రీలో కొంతకాలం ఉండాలంటే స్టార్ హీరోలతో జతకట్టాల్సిందే. లేదంటే వారికి ఫ్యూచర్ ఉండదు. ఆడియన్స్ కూడా ఆ హీరోయిన్స్ ను త్వరగా మర్చిపోతారు. అందుకే.. కొత్త హీరోయిన్స్ స్టార్ హీరోలతో సినిమా చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించాలి" అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాళవిక చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుస్తున్నాయి. 

ఇక మాళవికా మోహన్ విషయానికి వస్తే.. ఆమె తండ్రి సీనియర్ కెమెరా మెన్ మోహన్(Mohan). 2013లో హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు మాళవికా. రజినీకాంత్(Rajinikanth) హీరోగా వచ్చిన పేట(Peta) సినిమాతో సౌత్ సినిమాల్లో అడుగుపెట్టిన ఆమె.. విజయ్ తలపతి(Vijay Thalapathy) ప్రధాన పాత్రలో వచ్చిన మాస్టర్(Master) సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత ధనుష్(Danush) తో మారన్(Maaran) సినిమా చేసింది. ఇక ప్రస్తుతం విక్రమ్ తో తంగలాన్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న రాజా డీలక్స్(Raja delux) సినిమాలో కూడా చేస్తోంది. ఈ సినిమా గనక హిట్ అయితే.. ఈ బ్యూటీ తెలుగులో కూడా బిజీ అవడం ఖాయం.