Niti Taylor: విడాకుల బాటలో మేం వయసుకు వచ్చాం హీరోయిన్ నితీ టేలర్

Niti Taylor: విడాకుల బాటలో మేం వయసుకు వచ్చాం హీరోయిన్ నితీ టేలర్

ఈ మధ్య సినిమా స్టార్ చాలా మంది విడాకుల బాటపడుతున్నారు. ఇండస్ట్రీలో ఐడెమ్ కొత్తకాదు కానీ, ఈ మధ్య వరుసగా విడాకుల వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగు సమంత, నాగ చైతన్య. తమిళం లో ధనుష్, ఐశ్వర్య, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్, సైంధవి ఇలా చాలా మంది విడాకులు తీసుకున్నారు. తాజాగా ఈ లిస్టులో మరో హీరోయిన్ కూడా చేరిపోయింది. ఆ బ్యూటీ మరెవరో కాదు నితీ టేలర్. 

హీరో తనీష్ నటించిన మేం వయసుకు వచ్చాం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఈ సినిమాలో దిల్ పాత్రలో కనిపించిన ఈ అమ్మడు తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులు దోచేసుకుంది. సినిమా కూడా మంచి విజయం సాధించడంతో వరుస అవకాశాలు దక్కించుకుంది. అలా పెళ్లి పుస్తకం, లవ్ డాట్ కామ్ వంటి సినిమాలు చేసింది కానీ, అవి అంతగా సక్సెస్ కాకపోవడంతో సినిమాలకు దూరమయ్యింది నితీ. 

ఆ తరువాత కొంతకాలనీకే ఆర్మీ అధికారి పరీక్షిత్ బవా ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. 2020లో వీరి పెళ్లి జరిగింది. అంత బానే ఉంది అనుకునే సమయంలో సడన్ గా ఇన్స్టాలో తన పేరు పక్క నుంచి భర్త ఇంటి పేరుని తొలగించింది. అంతేకాదు.. ఇద్దరూ కలిసున్న కొన్ని ఫోటోలను  కూడా తొలగించింది. దాంతో.. ఆమె విడాకులు తీసుకోనుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.