
సౌత్ బ్యూటీ శృతి హాసన్ అదిరిపోయే కౌంటర్ వేశారు. సౌత్ ఇండియన్ స్టార్స్ గురించి ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసేవారికి ఇచ్చిపడేశారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ కి ఇక్కడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. శృతి హాసన్ ఓపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరోపక్క సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. తన సినిమాలు. పర్సనల్ విషయాల గురించి ఫ్యాన్స్ తో, నెటిజన్స్ తో పంచుకుంటూ ఉంటారు.
ఇందులో భాగంగానే తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్స్ సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పవా అని అడిగాడు. దానికి సీరియస్ గా స్పందించిన శృతి.. ఈ రకమైన జాతివివక్షను నేను సహించను. మమ్మల్ని ఇడ్లీ, దోస, సాంబార్ అని పిలిస్తే ఊరుకోము. మాలా ఉండటానికి ట్రై చేయకండి. మమ్మల్ని మీరు అనుకరించలేరు. ఎలా పడితే అలా పిలిచేసి దాన్ని కామెడీగా తీసుకోవడం మావల్లకాదు. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమేని అడిగావు కదా.. నోరు మూసుకుని వెళ్లు.. అంటూ తమిళంలో రాసుకొచ్చారు శృతి. ఈ ట్వీట్ చూసిన ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అదిరిపోయే కౌంటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ తో డెకాయిట్ అనే సినిమా చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాను షానీల్ డియో తెరకెక్కిస్తుండగా.. అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. డిఫరెంట్ కథాంశంతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.