ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు : ట్రెండింగ్​ బ్యూటీ

 ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు : ట్రెండింగ్​ బ్యూటీ

ట్రెండింగ్​ బ్యూటీ శ్రీలీల(Sreeleela) మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బాలకృష్ణతో ఆమె నటించిన భగవంత్​ కేసరి(Bhagavanth Kesari) దసరా కానుకగా ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో మాట్లాడుతూ ఈ బ్యూటీ కొన్ని ఇంట్రెస్టింగ్​ విషయాలు చెప్పింది.

నెలకో సినిమా రిలీజ్​ అవ్వడం ఓ విధంగా సంతోషంగానే ఉన్నా దీని వెనకాల ఎంతో కష్టం ఉంది. రోజుకు 20 గంటలు సినిమా షూటింగ్​, డబ్బింగ్​, ప్రమోషన్స్​ ఇలా ఎన్నో పనుల్లో బిజీగా ఉంటున్నాను. అవన్నీ బయటకు కనిపించవు. ఆ కష్టం నాకు మాత్రమే తెలుసు. కానీ, పరిశ్రమలో లెజెండరీ నటులతో పోలిస్తే ఇది చాలా తక్కువే అని తెలిపింది. 

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువ డిమాండ్ ఉన్న హీరోయిన్ శ్రీలీల. ఈ బ్యూటీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది. దాదాపు 10 మూవీస్ లో నటిస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ఈ అక్టోబర్లో బాలయ్య బాబు తో భగవంత్ కేసరి, నవంబర్‌లో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, జనవరిలో మహేష్ బాబు గుంటూరు కారం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా దాదాపు 10 చిత్రాల తర్వాత..హను రాఘవపూడి డైరెక్షన్లో వస్తోన్న మూవీలో హీరో ప్రభాస్ తో మరో భారీ చిత్రానికి సైన్ చేసింది. 

హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న మూవీ ఆర్మీ బ్యాక్ డ్రాప్లో ఉండే ఇంటెన్స్..ఎమోషన్ లవ్ స్టోరీ అని టాక్ వినిపిస్తోంది. దిల్రాజు బ్యానర్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు టాక్.  అలాగే దసరా స్పెషల్గా ఈ మూవీకి సంబంధించి ఆఫీసియల్ అనౌన్స్ మెంట్ వెలువడే అవకాశం ఉంది. వీరిద్దరి ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ  హను ఫ్యాన్స్..ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.