పెళ్లికి తక్కువ ఏజ్ అడ్డే కాదంటున్న హీరోయిన్లు

పెళ్లికి తక్కువ ఏజ్ అడ్డే కాదంటున్న హీరోయిన్లు

పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు..తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ ..మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అన్నాడు ఓ సినీ కవి. ఈ మాటను నిజం చేస్తూ.. కొందరు తారలు.. మనువాడుతున్నారు. లేటెస్ట్ గా అందాల తార నయన తార కూడా.. పెళ్లి పీటలెక్కింది. ప్రియుడు విఘ్నేష్ శివన్ ను హిందు సాంప్రదాయంలో పెళ్లి చేసుకోని ఏడు అడుగులు నడిచింది. ఈ సౌత్ లేడీ సూపర్ స్టార్. ఈ పెళ్లిలో తమిళ నాడు సీఎం స్టాలిన్ తో పాటు... చిరంజీవి, రజినీకాంత్, షారుఖ్ ఖాన్.. లాంటి మరికొందరు సినీ సెలబ్రీటీలు సందడి చేశారు. విఘ్నేష్ శివన్ దర్శకుడుగా ఆకట్టుకుంటున్న మ్యాటర్ తెలిసిందే. ఈయన దర్శకత్వంలో... నానుమ్ రౌడీ ధాన్, కణ్మణీ రాంబో ఖతీజా లాంటి సినిమాలలో నటించింది నయన్. కణ్మణీ రాంబో ఖతీజాకు వీరిద్దరూ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇక.. అసలు విషయానికొస్తే ఈ యువ దర్శకుడు  హీరోయిన్ నయనతార కంటే... పదకొండు నెలల చిన్నోడు. నయన్ 1984 నవంబర్ 18న జన్మిస్తే.. 1985 సెప్టెంబర్ 18 న విఘ్నేష్ పుట్టాడు. వీరిద్దిర మధ్యా చిగురించిన ప్రేమకు వయసు అడ్డురాలేకపోయింది. సాంప్రదాయాన్నిఎదురించి మరీ.. వైఫ్ అండ్ హస్బెండ్స్ అయ్యారు.

నయన్ కంటే ముందుగా మరికొంత మంది తారలు......

నయన తార కంటే ముందే మరికొందరు తారలు కూడా తమకంటే.. వయసు తక్కువగా ఉన్నవారిని మ్యారేజ్ చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్, నమ్రతలు... వంశీ మూవీ షూటింగ్ టైమ్ లో ప్రేమలో మునిగితేలారు. తర్వాత పెళ్లి చేసుకొని ముచ్చటైన జంట అనిపించుకున్నారు. ఈ బ్యూటిఫుల్ కపుల్ కు.. గౌతమ్, సితార అనే అందమైన పిల్లలు కూడా పుట్టారు. ఇక మహేష్ కంటే నమ్రత రెండేళ్లు పెద్దది.1972జనవరి 22 న జన్మిస్తే.. మహేష్ 1975 ఆగస్ట్ 9న పుట్టాడు.

అభిషేక్ బచ్చన్ తో.. ఐశ్వర్యా రాయ్ వివాహ జీవితం సాఫీగా సాగుతుంది. ఇద్దరూ వెండితెర మీద మెరిసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ప్రపంచసుందరి.. అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ కంటే.. రెండేళ్లు పెద్దది. ఐశ్వర్య 1973 నవంబర్ 1 న పుట్టింది. ఈమె హస్బెండ్ 1976 ఫిబ్రవరి 5న ఈ భూమి మీదికి వచ్చాడు. 

ఇక ఐశ్వర్యా లాగేనే అందాల కీరిటం దక్కించుకుంది ప్రియాంక చోప్రా. నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీరిద్దరి మధ్య దాదాపుగా 11 ఏళ్ల వయసు వత్యాసం ఉంది. ఈ వయసు కారణంగా.. సోషల్ మీడియాలో పలు విమర్శలు కూడా దుర్కొంది ప్రియాంక. అయినా..ప్రస్తుతం..తాను మెచ్చిన వాడితో హాయిగా కాపురం చేస్తుంది.సరోగసీ ద్వారా పండండి బిడ్డకు కూడా జన్మను ఇచ్చింది. . ప్రియాంక చోప్రా 1982 జూలై 18 న జన్మించింది. ఇక నిక్ జోనస్ 1992 సెప్టెంబర్ 16న పుట్టాడు.

అనుష్క శర్మ యాక్టర్ గానే కాక నిర్మాతగానూ మంచి మార్కులు కొట్టేసింది. క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లీని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఓ పాపకు విరాట్ ని తండ్రిని కూడా చేసింది. కానీ విరాట కంటే..అనుష్క ఆరు నెలలు పెద్దది .1988 మే 1 న అనుష్క...1988 నవంబర్ 5 న విరాట్ జన్మించారు. 

ఒక్క సినిమాలో కూడా కలిసి నటించకపోయినా నిజ జీవిత భాగస్వాములైన సైఫ్ అలీ ఖాన్ కంటే అమృతా సింగ్ పదమూడేళ్లు పెద్ద. అమృతా సింగ్ పుట్టినరోజు విషయానికొస్తే.. 1958 ఫిబ్రవరి 9 న జన్మించింది. సైఫ్..1970 ఆగస్ట్ 16 పురుడు పోసుకున్నాడు.

ఇక బిపాషా బసు తనకన్న మూడేళ్లు చిన్నవాడైన కరణ్ సింగ్ గ్రోవర్ ను పెళ్లి చేసుకుంది. వీళ్లిద్దరి ప్రేమ వ్యవహారం అప్పట్లో పెద్ద చర్చనీయాంశం అయింది. 1979 జనవరి 7న బిపాషా పుడితే.. ఈమె భర్త 1983 ఫిబ్రవరి 23న పుట్టాడు. శిల్పాశెట్టి కూడా వయసులో తనకన్నా చిన్నవాడైన రాజ్ కుంద్రాను ప్రేమ వివాహాం చేసుకుంది. వీళ్లకు ఓ పాప, బాబు ఉన్నారు. గతేడాది రాజ్ కుంద్రా ఫోర్న్ వీడియోల కేసులో అరెస్ట్ అయ్యాడు. శిల్పా శెట్టి  బర్త్ డే విషయానికొస్తే.. 1975 జూన్ 8 జన్మించింది. రాజ్ కుంద్రా 1975 సెప్టెంబర్ 9న జన్మించాడు.

క్రికెట్ కి దేవుడుగా భావించే భారతరత్న సచిన్ టెండూల్కర్ తన కంటే ఐదేళ్లు పెద్దయిన అంజలిని పెళ్లి చేసుకున్నాడు. అంజలి టెండూల్కర్ ఏజ్ విషయానికొస్తే..1967 నవంబర్ 10 పుట్టింది. సచిన్ 1973 ఏప్రిల్ 24 న పుట్టాడు. కొన్నాళ్లు డేటింగ్ లో మునిగిన.. అంగద్ బేడి, నేహా దూపియా ప్రేమ వివాహాం చేసుకున్నారు. నేహా దూపియా కంటే అంగద్ బేడీ రెండేళ్లు చిన్నవాడు. నేహా ధూపియా విషయానికొస్తే.. 1980 ఆగస్ట్ 27 న జన్మించింది.అంగద్ బేడి పుట్టినరోజు విషయానికొస్తే..1983 ఫిబ్రవరి 6 న జన్మించింది.

అలాగే తొందర్లో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న మలైక అరోరా, అర్జున్ కపూర్ కంటే పదిహేనేళ్లు పెద్ద. వీరిద్దరి వ్యవహారం.. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి వీళ్ల ప్రేమ పెళ్లిగా మారుతుందో లేదో చూడాలి.