
ఆటోగా, స్కూటర్‌గా వాడుకోవడానికి వీలుండే సరికొత్త ఎలక్ట్రిక్ వెహికల్‌ను హీరో మోటోకార్ప్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ సర్జ్ ప్రదర్శించింది. ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ముందుకు కనెక్ట్ చేసుకొని బండి మొత్తాన్ని త్రీ వీలర్ ఆటోగా వాడుకోవచ్చు. లేదనుకుంటే స్కూటర్‌ను బయటకు తీసేసి టూ వీలర్‌గా వాడుకోవచ్చు. సర్జ్ ఎస్32 తో ఒకే బండి ఖర్చుతో రెండు బండ్లు పొందొచ్చని కంపెనీ చెబుతోంది.