ప‌‌‌‌‌‌‌‌తంగ్ మూవీ నుండి హే హ‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్తే లిరిక‌‌‌‌‌‌‌‌ల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ విడుద‌‌‌‌‌‌‌‌ల

ప‌‌‌‌‌‌‌‌తంగ్ మూవీ నుండి హే  హ‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్తే లిరిక‌‌‌‌‌‌‌‌ల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ విడుద‌‌‌‌‌‌‌‌ల

ప‌‌‌‌‌‌‌‌తంగుల పోటీ నేపథ్యంలో తెరకెక్కుతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా ‘ప‌‌‌‌‌‌‌‌తంగ్’. ప్రీతి ప‌‌‌‌‌‌‌‌గ‌‌‌‌‌‌‌‌డాల‌‌‌‌‌‌‌‌, ప్రణవ్‌‌‌‌‌‌‌‌ కౌశిక్, వంశీ పూజిత్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నారు. సింగర్ ఎస్పీ చరణ్‌‌‌‌‌‌‌‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రణీత్ ప్రత్తపాటి డైరెక్ట్ చేస్తుండగా, విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మక, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘హే  హ‌‌‌‌‌‌‌‌లో.. న‌‌‌‌‌‌‌‌మ‌‌‌‌‌‌‌‌స్తే’ అంటూ సాగే లిరిక‌‌‌‌‌‌‌‌ల్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను శ‌‌‌‌‌‌‌‌నివారం హైదరాబాద్‌లోని పాత‌‌‌‌‌‌‌‌బ‌‌‌‌‌‌‌‌స్తీలో  విడుద‌‌‌‌‌‌‌‌ల చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన  ఆస్కార్ అవార్డ్ విన్నర్  చంద్రబోస్, దర్శకుడు అనుదీప్ పాట చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని కోరారు.  నిర్మాతల్లో   ఒక‌‌‌‌‌‌‌‌రైన సంప‌‌‌‌‌‌‌‌త్ మ‌‌‌‌‌‌‌‌క మాట్లాడుతూ ‘ఈ పాట విని సినిమా చేయ‌‌‌‌‌‌‌‌డానికి ఓకే అన్నాను. ఈ పాట‌‌‌‌‌‌‌‌తోనే మా జ‌‌‌‌‌‌‌‌ర్నీ ప్రారంభం అయింది. హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ బ్యూటీని చాటి చెప్పే ఈ పాట హైద‌‌‌‌‌‌‌‌రాబాద్ యాంథ‌‌‌‌‌‌‌‌మ్‌‌‌‌‌‌‌‌గా నిలిచిపోతుంది’ అన్నారు.  ‘సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌ బస్తీ నేపథ్యంలో సహజత్వానికి దగ్గరగా తెరకెక్కిస్తున్న యూత్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ కామెడీ మూవీ ఇది. ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎమోషన్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది’ అని మేకర్స్ తెలియజేశారు.