హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2023కి దరఖాస్తుల ఆహ్వానం

హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2023కి దరఖాస్తుల ఆహ్వానం

హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ 2023కి దరఖాస్తుల ఆహ్వానం
ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో అవార్డులు 
జర్నలిజం, అడ్వర్టైజ్ మెంట్, సర్క్యులేషన్ కేటగిరీల్లో అందజేత 

హైదరాబాద్, వెలుగు : మీడియా రంగంలో జర్నలిజం, అడ్వర్టైజ్ మెంట్, సర్క్యులేషన్ విభాగాల్లో విశేష సేవలను అందిస్తున్న వారిని గౌరవించేందుకు ‘హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్’ను అందించనున్నట్లు హైబిజ్ టీవీ మేనేజ్​మెంట్ ప్రకటించింది. 2023కు గాను ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో ఈ మూడు కేటగిరీల్లో అవార్డులను అందిస్తున్నామని, ఆయా రంగాల్లో రాణిస్తున్న వారు అవార్డులకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. హైబిజ్ టీవీ కొన్నేండ్లుగా వరుసగా పలు రంగాల్లో అవార్డులను అందజేస్తోంది. విమెన్స్ లీడ‌‌‌‌ర్ షిప్ అవార్డ్స్ (2020, 21, 22), హెల్త్ కేర్ అవార్డ్స్ (2021, 22), ఫుడ్ అవార్డ్స్ (2022) అందజేసింది. 2021, 2022 సంవత్సరాల్లో హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రదానం చేసింది. ఇప్పుడు 2022–23 ఏడాదికి గాను మూడో ఎడిషన్ మీడియా అవార్డ్స్ కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది.

మ‌‌‌‌రిన్ని వివ‌‌‌‌రాల కోసం 9666796622 నెంబర్ లో సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సమావేశంలో ఎం. రాజ్ గోపాల్ (ఎండీ, - హైబిజ్ టీవీ అండ్​ తెలుగు నౌ), రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ – క్రెడాయ్),  ఎం. రవీందర్ రెడ్డి (మార్కెటింగ్ డైరెక్టర్– భారతి సిమెంట్), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్),  సోమశేఖర్ (ఎక్స్ అసోసియేట్ ఎడిటర్ , చీఫ్ ఆఫ్ బ్యూరో – ది హెచ్.బి.ఎల్), వినోద్ (ఎక్స్ జీఎం సాక్షి, ఎక్స్ మేనేజర్ ఈనాడు), తదితరులు పాల్గొన్నారు.