సిగరెట్ పెట్టెల్లో.. ల్యాప్ టాప్‌లో బంగారం దాచి విమానం ఎక్కారు

సిగరెట్ పెట్టెల్లో.. ల్యాప్ టాప్‌లో బంగారం దాచి విమానం ఎక్కారు

దుబాయ్ నుంచి వచ్చి.. చెన్నై ఎయిర్ పోర్టులో పట్టుబడ్డారు

చెన్నై: సిగరెట్ పెట్టెల్లో.. ల్యాప్ టాప్‌లో బంగారం రహస్యంగా దాచి పెట్టుకుని ఏమీ తెలియనట్లు దుబాయ్‌లో విమానం ఎక్కారు. చెన్నై ఎయిర్ పోర్టులో దిగి కాసేపట్లో బయటపడేవారే. కానీ ఎందుకో కస్టమ్స్ వారికి అనుమానంతో రావడంతో చివరి నిమిషంలో నిలిపేశారు.  కాసేపు పక్కన వేచి ఉండమని చెప్పి.. స్కానర్లతో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తే.. ఐదుగురు ప్రయాణికులు తమ ప్యాంట్లోలోని రహస్య ప్రదేశంలో దాచిన బంగారు తునకలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు తమదైన శైలిలో మరింత క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ.. ప్రశ్నించారు. సిగరెట్ ప్యాకెట్లలోనూ.. చివరకు ల్యాప్ టాప్ ఓపెన్ చేసి చూస్తే బంగారమే బంగారం. మొత్తం 3.46 కిలోల బంగారం దాచిపెట్టి తీసుకొచ్చినట్లు గుర్తించారు. కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించి విదేశాల నుండి అక్రమంగా రవాణా చేసిన బంగారం విలువ 1.75 కోట్లు ఉంటుందని అంచనా.  నిందితులను కస్టమ్స్ వారు అదుపులోకి తీసుకుని ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి..

పనిచేయకున్నా జీతాలు చెల్లింపు.. ఆపై ప్రమోషన్‌తో బదిలీ

గుహలో భారీగా బంగారం నిల్వలు.. కళ్ల ముందే హింట్ ఉన్నా తెరవలేకపోతున్నారు

తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టడానికి 6 ఉపాయాలు