ఢిల్లీలో హై ఆలర్ట్​: టెర్రరిస్ట్​లు వచ్చారని ఇంటెలిజన్స్​ హెచ్చరిక

ఢిల్లీలో హై ఆలర్ట్​: టెర్రరిస్ట్​లు వచ్చారని ఇంటెలిజన్స్​ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో భారీ టెర్రర్ అటాక్ కుట్ర జరుగుతోందని ఇంటెలిజన్స్ హెచ్చరించింది. కాశ్మీర్ నుంచి ఐదుగురు టెర్రరిస్టులు ట్రక్కులో బయలుదేరారని…ఇప్పటికే వాళ్లు ఢిల్లీకి చేరి ఉండవచ్చని తెలిపింది. అసలే కరోనా ఎఫెక్ట్ తో పరేషాన్ లో ఉన్న ఈ టైమ్ లోనే దాడులు చేయాలని ప్లాన్ చేస్తున్నారని భద్రత బలగాలను అలర్ట్ చేసింది. ఇటీవల జమ్మూకాశ్మీర్ లో టెర్రరిస్టుల యాక్టివిటీ పై సెక్యూరిటీ ఫోర్స్ ప్రత్యేక దృష్టి పెట్టింది. నాలుగు నెలల కాలంలోనే నాలుగు టెర్రరిస్ట్ గ్రూప్ ల కీలక వ్యక్తులను హతమార్చింది. వారి చావుకు ప్రతీకారంగా టెర్రరిస్టులు భారీ అటాక్ చేయాలని కుట్ర చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.

ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో పోలీసులు, కేంద్ర బలగాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీ మొత్తాన్ని జల్లెడ పట్టాయి. టెర్రరిస్టులు రోడ్డు మార్గంలోనే చొరబడి ఉంటారన్న అనుమానంతో ఎక్కడికక్కడ చెకింగ్ మొదలుపెట్టాయి. గెస్ట్ హౌజ్ లు, హోటళ్లకు వచ్చే వారి వివరాల కచ్చితంగా తీసుకోవాలని సూచించాయి. కాశ్మీర్ నంబర్ ప్లేట్ తో ఉన్న వెహికిల్స్ ను ఆదివారం క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు చెప్పాలంటూ లౌడ్ స్పీకర్ల ద్వారా అనౌన్స్ చేశారు. బస్టాండ్, రైల్వే స్టేషన్ల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ నార్త్ జిల్లాల్లోని రాకపోకలపై ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఆయా జిల్లాల పోలీసు అధికారులకు, స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి