జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్

జమ్ముకశ్మీర్ లో హై అలర్ట్

జమ్ముకశ్మీర్‌లో సైన్యం భారీగా మోహరించడంతో పాటు కట్టు దిట్టమైన భద్రత చేపట్టింది. స్కూళ్లు, షాపులు తెరిచినా వాటిని తగుల బెట్టేస్తాం అంటూ ఉగ్రవాదుల పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో సైన్యం అలర్టైంది. రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతారని భావించినా సైన్యం తీసుకున్న పటిష్ట చర్యల కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘట జరగలేదు. దీంతో విధించిన ఆంక్షలను ప్రభుత్వం క్రమేపీ సడలిస్తూ, పౌర జీవనం సాఫీగా సాగేందుకు అవకాశం కల్పించింది. ఇప్పుడు ఉగ్రవాదుల పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో సైన్యం అప్రమత్తమైంది. తనిఖీలు నిర్వహించి అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు సైన్యం, పోలీసులు. మరోవైపు అనంతనాగ్ లోని ఆష్ ముఖం మార్కెట్లో దుకాణ దారులను ఉగ్రవాదులు బెదిరించారన్న సమాచారంతో సైన్యం ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతోంది. శ్రీనగర్ ప్రాంతంలో షాపు తెరిచిన ఓ వ్యక్తిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్యచేశారు. దీంతో శ్రీనగర్లో ఉగ్రవాదులు ఉన్నారని గుర్తించిన సైన్యం నగరంలో మళ్లీ ఆంక్షలు విధించింది.