తీన్మార్ మల్లన్నకు హైకోర్టు అడ్వకేట్ జేఏసీ మద్దతు

తీన్మార్ మల్లన్నకు హైకోర్టు అడ్వకేట్ జేఏసీ మద్దతు
  •     పట్టభద్రులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి

బషీర్ బాగ్, వెలుగు: ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు హైకోర్టు అడ్వకేట్ జేఏసీ ప్రకటించింది. పట్టభద్రులందరూ మల్లన్నకు అండగా నిలిచి.. భారీ మెజారిటీతో గెలిపించాలని జేఏసీ నాయకులు కోరారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జేఏసీ కో ఆర్డినేటర్ వెంకటేశ్ ఇంద్రపల్లి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జేఏసీ ఆర్గనైజర్ దమ్మిగారి కనకయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గుంపుల శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొని మాట్లాడారు.

ప్రజా గొంతుక అయిన మల్లన్నను చట్టసభలకు పంపించాలని విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగ యువత సమస్యలను ఆయన చట్టసభల్లో లేవనెత్తుతారన్నారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఆయన ఎంతో కృషి చేశారని, మల్లన్నను గెలిపించి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలని వారు పట్టభద్రులను కోరారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు పంతం రాజేష్ , బత్తుల కృష్ణ , రామారావు, మంజుల, విజయకుమారి, కేశవరావు తదితరులు పాల్గొన్నారు.