
గజ్వేల్, వెలుగు: బిగ్ బాస్-–7 విజేత పల్లవి ప్రశాంత్‌కు న్యాయం జరిగేలా పోలీసులు సహకరించాలని హైకోర్టు అడ్వొకేట్ రాజేశ్ కుమార్ కోరారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో పల్లవి ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు విజయమ్మ, సత్యనారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రశాంత్‌పై కేసు నమోదు చేశారని సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వస్తున్నాయని, అందువల్ల కేసుకు సంబంధించిన అన్ని వివరాలు పోలీసులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. సోమవారం నుంచి అతనుకనిపించకుండాపోయాడని ప్రశాంత్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు.
ప్రశాంత్ బిగ్‌బాస్ విజేతగా నిల్చిన తర్వాత అతనిపై కొందరు కక్షపూరితంగా వ్యవహరించినట్టు అనిపిస్తోందన్నారు. పోలీసులు మానవతా దృక్పథంతో ఆలోచించి అతనికి న్యాయం జరిగేలా చూడాలని, కేసు వివరాలను ఆన్లైన్లో పెట్టాలన్నారు.