డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి

డబుల్ బెడ్రూం ఇళ్లపై 2 నెలల్లో నివేదిక ఇవ్వండి

డబుల్ బెడ్ రూం ఇళ్లపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎన్ని ఇళ్లు నిర్మించారు? లబ్దిదారులకు ఎన్ని కేటాయించారో తెలపాలని స్పష్టం చేసింది. డబుల్ బెడ్ రూం ఇళ్లు అర్హులకు కేటాయించడంలేదంటూ బీజేపీ నేత ఎన్. ఇంద్రసేనా రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కేంద్రం నిధులతో లక్ష ఇళ్లు నిర్మించారని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో వాటిని లబ్దిదారులకు కేటాయించడం లేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మరోవైపు డబుల్ బెడ్రూం ఇళ్లను వీలైనంత త్వరగా అర్హులకు కేటాయిస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం రెండు నెలల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

For more news 

కేసీఆర్, పీకే వ్యూహాలు ఇక పని చేయవు

ఈ నెల 30న ఢిల్లీలో సీఎంలు, సీజేఐల సదస్సు