ప్రైవేట్ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు అడగడంపై హైకోర్టు విచారణ

ప్రైవేట్ కాలేజీలు ఒరిజినల్ సర్టిఫికెట్లు అడగడంపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలు తీసుకుంటున్నాయన్న పిల్ పై హైకోర్టు విచారణ జరిపింది. యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా కాలేజీలు వ్యవహహరిస్తున్నాయని ఫోరం ఆగేనెస్ట్ కరప్షన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలు చేసింది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ), జేఎన్టీయూ(హైదరాబాద్)  హైకోర్టుకు నివేదికలు సమర్పించాయి. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకోవద్దని కాలేజీలకు స్పష్టం చేశామని హైదరాబాద్ జేఎన్ టీయూ స్పష్టం చేసింది. కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలోనూ చేర్చినట్టు జే ఎన్ టీ యూ తెలియజేసింది. ప్రైవేటు కాలేజీలు ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకున్నట్టు తమకు ఇంత వరకు  ఫిర్యాదులు రాలేదని ఓయూ తెలియజేసింది. ఓయూ, జేఎన్ టీయూహెచ్ నివేదికలు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు విచారణ ముగించింది.