దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి : హైకోర్టు న్యాయవాది అనిల్ కుమార్

దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలి : హైకోర్టు న్యాయవాది అనిల్ కుమార్

హాలియా, వెలుగు : దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఏకే ఫౌండేషన్ చైర్మన్, హైకోర్టు న్యాయవాది కట్టెబోయిన అనిల్ కుమార్ సూచించారు. ఆదివారం హాలియా పట్టణంలోని శ్లోక స్కూల్ లో  ఏకే ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కంప్యూటర్, ఉపాధి కల్పన శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా అనిల్​కుమార్ మాట్లాడుతూ దివ్యాంగులు నిరంతరం స్కిల్స్ పెంచుకుంటూ ముందుకు వెళ్తే తప్పకుండా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. దివ్యాంగులకు ఏకే ఫౌండేషన్, విద్యాధన్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం విద్యాధన్ ఫౌండేషన్ ద్వారా ఇంటర్​షిప్ కు ఎన్నికైన మదుపు మధుకు మొదటి నెల జీతం ఆయన అందజేశారు.

 కార్యక్రమంలో విద్యాధన్ ఫౌండేషన్ చైర్మన్, ఫిక్టీవ్ కంపెనీ ఆపరేషన్స్ హెడ్ ఈదర ప్రసన్న, అమీర్ అలీ ఫౌండేషన్ చైర్మన్ అమీర్ అలీ, ధాత్రి ట్రాన్స్​పోర్ట్​ఎండీ రవి, ఫౌండేషన్​సభ్యులు పులి శ్రీకాంత్, గంగుల అంజియాదవ్, మన్నెం కోటి, శేఖర్ గౌడ్, గంగుల లింగస్వామియాదవ్, బొమ్మిశెట్టి రామలింగయ్య  పాల్గొన్నారు.