ఇయ్యాల హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం

ఇయ్యాల హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం
  • ఉజ్జల్‌‌‌‌ భుయాన్‌‌‌‌తో ప్రమాణం చేయించనున్న గవర్నర్‌‌‌‌‌‌‌‌ 

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్‌‌‌‌లో గవర్నర్ తమిళిసై సీజేతో ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే, ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరుపై సస్పెన్స్ నెలకొంది. గత కొంత కాలంగా రాజ్ భవన్‌‌‌‌లో జరుగుతున్న కార్యక్రమాలకు ఆయన హాజరుకావడం లేదు.