ల్యాంగ్వేజీ పండిట్ పోస్టులని..అప్​గ్రేడ్ చేయాలె

ల్యాంగ్వేజీ పండిట్ పోస్టులని..అప్​గ్రేడ్ చేయాలె
  •     హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చారిత్రాత్మకం 
  •     భాషాపండితుల సంఘాల హర్షం 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ల్యాంగ్వేజీ పండిట్  పోస్టుల అప్ గ్రెడేషన్ పై  హైకోర్టు సింగిల్ బెంచ్  ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ డివిజన్  బెంచ్  తీర్పు ఇవ్వడంపై రాష్ర్టీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్ యూపీపీ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సి.జగదీశ్, ఎస్.నర్సిములు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కొన్ని టీచర్ల సంఘాల భాషా పండితులకు రావాల్సిన న్యాయమైన ప్రమోషన్లను కూడా రాకుండా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ల్యాంగ్వేజీ పోస్టులకు ప్రమోషన్ లో ల్యాంగ్వేజీ పండితులనే తీసుకోవాలని, భాషేతర పోస్టులను ఎస్జీటీలతో నింపాలని తీర్పు ఇవ్వడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. ల్యాంగ్వేజీ పండిట్ పోస్టుల అప్​గ్రెడేషన్​పై జస్టిస్  మాధవి ఇచ్చిన సింగిల్  బెంచ్  తీర్పును రద్దుచేస్తూ పండిట్  పోస్టులను పండిట్లకే ఇవ్వాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆర్ యూపీపీటీ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్లా, క్రాంతికృష్ణ స్వాగతించారు.

ఈ తీర్పును అమలుచేస్తూ వెంటనే ల్యాంగ్వేజీ పండిట్లకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. కాగా, ల్యాంగ్వేజీ పండిట్  పోస్టుల ప్రమోషన్ల విషయంలో సింగిల్  బెంచ్  ఇచ్చిన తీర్పును రద్దుచేస్తూ భాషా పండితులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంపై రాష్ట్ర భాషోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చక్రవర్తుల శ్రీనివాస్, గౌరీశంకర్ రావు ఓ ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.