యాదాద్రిలో రూరల్ వైన్స్లకే డిమాండ్..ఆ షాపులకే ఎక్కువ అప్లికేషన్లు..

యాదాద్రిలో రూరల్ వైన్స్లకే డిమాండ్..ఆ షాపులకే ఎక్కువ అప్లికేషన్లు..
  • మున్సిపాలిటీల్లో తక్కువే 
  • రూరల్​లోనే రిస్క్​ తక్కువ​.. ఇన్​కం ఎక్కువ
  • బెల్ట్​ షాపులకు సప్లయ్​ చేసుకునే ఛాన్స్​

యాదాద్రి, వెలుగు: వైన్స్​లకు అప్లికేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇన్​కం ఎక్కువ రావడంతో పాటు రిస్క్​ తక్కువగా ఉండే గ్రామాల్లో షాపులను గుర్తించిన లిక్కర్​ వ్యాపారులు వాటికే ఎక్కువగా అప్లికేషన్లు వేశారు. దీంతో  రూరల్​ ప్రాంతాల్లోని షాపులకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. 

యాదాద్రిలో 82 వైన్స్​లు

యాదాద్రి జిల్లాలో 82 వైన్స్​లు ఉన్నాయి. వీటిలో రూ. 60 లక్షల ఫీజు చెల్లించే వైన్స్​లు 16 ఉండగా ఇవి మొత్తం భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల పరిధిలోనే ఉన్నాయి. రూ. 55 లక్షలు చెల్లించే షాపులు 46,  రూ. 50 లక్షలు ఫీజు చెల్లించే షాపులు 20 ఉండగా ఇవి ఆలేరు, చౌటుప్పల్​, మోత్కూరు, భూదాన్​ పోచంపల్లి మున్సిపాలిటీలతో పాటు రూరల్​ మండలాల పరిధిలో ఉన్నాయి. 2776 అప్లికేషన్లు రాగా రూ. 83.28 కోట్ల ఇన్​కం వచ్చింది. 

అర్బన్​లో తక్కువ.. రూరల్​లో ఎక్కువ

కొత్త ఎక్సైజ్​ పాలసీ ద్వారా వైన్స్​ షాపులకు అప్లికేషన్లు దాఖలు ప్రారంభించినప్పటి నుంచి అర్బన్​ ప్రాంతాల్లోని వైన్స్​లకు అప్లికేషన్ల సంఖ్య తక్కువగా వచ్చాయి. రూరల్​ ప్రాంతాల్లోని వైన్స్​లకు ఎక్కువగా వచ్చాయి. ఆరు మున్సిపాలిటీల పరిధిలో 31 వైన్స్​లు ఉండగా 1016 అప్లికేషన్లు వచ్చాయి. ఓవరాల్​గా ఒక్కో షాపునకు 33 అప్లికేషన్లు వచ్చినట్టు లెక్కలు చెబుతున్నాయి. రూరల్​ ప్రాంతాల్లో 51 షాపులు ఉండగా 1760 అప్లికేషన్లు వచ్చాయి. ఈ లెక్కన ఓవరాల్​గా ఒక్కో షాపునకు 34 అప్లికేషన్లు వచ్చినట్టుగా ఎక్సైజ్​ డిపార్ట్​మెంట్​ లెక్కలు చెబుతున్నాయి.

రిస్క్​ తక్కువ​.. ఇన్​కం ఎక్కువ

అర్బన్​ ప్రాంతాలతో పోలిస్తే రూరల్​ ప్రాంతాల్లో రిస్క్​ తక్కువే. దీంతో ఎక్కువ మంది రూరల్​ ప్రాంతాల్లోని షాపులపైనే దృష్టి పెట్టారు. భువనగిరి, యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లో రూ. 60 లక్షల చొప్పున ఫీజు నిర్ణయించారు. వాటి పరిధిలోని 15 షాపులకు అప్లికేషన్లు తక్కువగా వచ్చాయి. కానీ భువనగిరి మున్సిపాలిటీకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న  అనాజీపూర్​ షాపునకు రూ. 60 లక్షల ఫీజు ఉన్నప్పటికీ 68  అప్లికేషన్లు వచ్చాయి. అదే విధంగా చౌటుప్పల్​ మండల పరిధిలోని ఎల్లంబావి వైన్స్​కు 91 అప్లికేషన్లు వచ్చాయి. మున్సిపాలిటీల్లోని ఏ ఒక్కషాపునకు కూడా ఈ సంఖ్యలో అప్లికేషన్లు రాలేదు. .

అదే విధంగా జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా బెల్ట్​ షాపులు నడుస్తున్నాయి. వీటికి రూరల్​ ప్రాంతాల్లోని వైన్స్​ నుంచే లిక్కర్​ సప్లయ్​ జరుగుతోంది. ఎమార్పీ రేటుకే బెల్ట్​ షాపులకు ఎద్ద ఎత్తున సేల్స్​ జరుగుతూ ఉంటోంది. దీంతో ఇన్​కం కూడా ఎక్కువగానే ఉంటోంది. అందుకే రూరల్​ వైన్స్​కు ఎక్కువగా ప్రయరిటీ ఇచ్చిన వ్యాపారులు ఎక్కువగా అప్లికేషన్లు వేశారు. 

భువనగిరి కంటే.. చౌటుప్పల్, గుట్టలో ఎక్కువ

జిల్లా కేంద్రమైన భువనగిరి కంటే చౌటుప్పల్​, యాదగిరిగుట్టలో ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. భువనగిరిలో 10 షాపులుంటే 319 అప్లికేషన్లు రాగా చౌటుప్పల్​ ఏడింటికి 227, గుట్టలో ఐదింటికి 165 వచ్చాయి.ఆలేరులో నాలుగింటికి 107, మోత్కూరులో మూడింటికి 100, పోచంపల్లిలో మూడింటికి 98 అప్లికేషన్లు వచ్చాయి. 

ఒక్క షాపునకు ఎక్కువగా అప్లికేషన్లు వచ్చిన గ్రామాలు

రూరల్​ ప్రాంతాల్లోని ఎల్లంబావి వైన్స్​కు 91, అరూర్​ 83, బట్టు గూడెం 75 అప్లికేషన్ల చొప్పున వచ్చాయి. బొమ్మల రామారంలో 70, అనాజీపూర్​ 68, దండుమల్కాపూర్​ 56,  నేలపట్ల 58, రఘునాథపురం 49, మాధాపూర్​, వలిగొండ, కొలనుపాకలోని ఒక్కో షాపునకు 40 అప్లికేషన్ల చొప్పున వచ్చాయి.