Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో సంజనా Vs ఫ్లోరా యుద్ధం.. స్టార్ట్ అయిన నామినేషన్స్ గేమ్!

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో సంజనా Vs ఫ్లోరా యుద్ధం.. స్టార్ట్ అయిన నామినేషన్స్ గేమ్!

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు 9' రసవత్తరంగా సాగుతోంది. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అన్న కాన్సెస్ట్ ను కంటెస్టెంట్లు బాగా వంటపట్టించుకున్నారు.  బిగ్ బాస్ ఆదేశాల మేరకు ఈ హౌస్ లో సెలబ్రిటీలను టెనెంట్స్ గా కామనర్స్ ఓనర్స్ మారిపోయారు. సెలబ్రీలతో పనులు చేయించడమే కాదు.. ఓనర్స్ పర్మిషన్ లేకుండా హౌస్ లోకి వెళ్లడానికి కూడా అనుమతి లేదు.   దీంతో టెనెంట్స్ , ఓనర్స్ మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది.  మొదటి రోజే సెలబ్రిటీలు, కామనర్స్ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కమెడియన్ ఇమ్మాన్యుయేల్ , మాస్ మాస్ హరీశ్ మధ్య  వాగ్వాదం చోటు చేసుకుంది..

రెండవ రోజు మరింత ఆసక్తిని పెంచేలా నామినేషన్స్ ప్రక్రియ ఈ రోజు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రోమోను రిలీజ్ చేశారు.   టెనంట్స్‌లో నుంచి ఒకరిని ఓనర్స్‌ నేరుగా నామినేట్‌ చేయొచ్చన్నాడు బిగ్‌బాస్‌.  దీంతో ఓనర్స్  అందరూ కలిసి కూర్చుని చర్చించుకుంటారు. చివరకు  సంజనను నామినేట్ చేయాలని ఒక అంగీకారానికి వస్తారు.  నీవు అబద్ధాలాడుతున్నామ్, వెనకాల నుంచి గుసగుసలాడుతూ మాట్లాడుతున్నావు. నీవల్లే గొడవులు అవుతున్నారంటూ ఓనర్స్ కారణాలు చెబుతారు. 

ఒక సందర్భంగా ఓనర్స్ లోని ప్రియ బ్యాక్‌ బిచింగ్‌ అని అనగానే సంజనా సీరియస్ అవుతోంది. అలాంటి పదాలు ఎందుకు వాడుతున్నావ్. మళ్లీ మళ్లీ వాడొద్దని ప్రియను హెచ్చరిస్తుంది.  ఆ తర్వాత ఫ్లోరా సైనీ - సంజనా మధ్య వాగ్వాదం చోటుచేసుకుంటుంది.  నా పర్సనల్ రిలేషన్ షిప్ గురించి పదే పదే ప్రస్తావిస్తూ మాట్లాడాల్సిన అవసరం మీకేంటి అని సంజనాను సైనీ నిలదీస్తుంది.  దీంతో ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది.

ఒకవేళ సంజన నామినేషన్స్ లోకి వస్తే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవరైతే కిచెన్ లో అడుగుపెడుతారో వారు ఎక్కువగా ఎలిమినేషన్ కు దగ్గరగా ఉంటుంటారు. అందులోనూ తొలి వారం  కెచెన్ లో దూరిన వారు మరో వారం కనిపించకుండా పోతారు. అదే ఎలిమినేట్ కు దారితీస్తుంది. హౌస్‌మేట్స్ ఒకరినొకరు నిందించుకుంటూ, వాగ్వాదానికి దిగడం ఈ షో రసవత్తరంగా మారింది.  మరి ఈ గండం నుంచి సంజనా గట్టెక్కుతుందో లేదో చూడాలి..

ALSO READ : ఓటీటీలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ హారర్ థ్రిల్లర్..