నిజామాబాద్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన సెక్యూరిటీ

నిజామాబాద్ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్టమైన సెక్యూరిటీ

రాష్ట్రంలోని నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పోలింగ్ పై ఆ జిల్లా కలెక్టర్ ఎం.ఆర్.ఎం. రావు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల అదనపు సీఈఓ  జ్యోతి బుద్ధ ప్రకాష్ తో కలిసి సమావేశం నిర్వహించిన ఆయన.. ఎన్నికలో పాల్గొన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ కు సీలు వేయడం జరిగిందని అన్నారు. ఓటింగ్ పూర్తయిన తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసి సీలు వేయడం జరిగిందని తెలిపారు. ఎన్నికల కమిషన్ ప్రోటోకాల్ ప్రకారంగా షీల్ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు ఈ ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల సాధారణ పరిశీలకులు కూడా పాల్గొన్నారని , స్ట్రాంగ్ రూమ్ వద్ద  పటిష్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.

రాష్ట్ర ఎన్నికల అదనపు అధికారి జ్యోతి బుద్ధప్రకాష్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల రోజున కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు.  ఈసి  నియమనిబంధనల మేరకు స్ట్రాంగ్ రూమ్ షీల్ ప్రక్రియను చేపట్టాలన్నారు. అభ్యర్థులు, అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో సీల్ పూర్తయిన తర్వాత ప్రతిరోజు జిల్లా ఎన్నికల అధికారులు ఉదయం కానీ సాయంత్రం గాని వాటిని పరిశీలన చేయాలని కోరారు.