ఉన్మాది దోస్త్ పై బంధువుల దాడి 

ఉన్మాది దోస్త్ పై బంధువుల దాడి 
  •  పవన్ ను కాపాడిన పోలీసులు 

  •   నర్సంపేట మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత 

 
 వరంగల్: చెన్నారావుపేట మండలం పదహారు చింతలతండాలో  ఉన్మాది నాగరాజు డబుల్ హత్యలకు పాల్పడగా దాని ఎఫెక్ట్ నిందితుని మిత్రులు, కుటుంబ సభ్యులపై పడింది. బానోతు శ్రీనివాస్, సుగుణ హత్యలో  నాగరాజుకు సహకారం అందించారనే అనుమానంతో గుండెన్ గా గ్రామంలో నిందితుని ఫ్రెండ్ పవన్ పై   దీపిక బంధువులు, గ్రామస్తులు దాడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులు పవన్ ను  కాపాడి అదుపులోకి తీసుకున్నారు.  లేదంటే మరో దారుణం చోటుచేసుకునేది. 

ఇదిలా ఉండగ  నిందితుడిని తమకు అప్పగించాకే పోస్టుమార్టం నిర్వహించాలంటూ నర్సంపేట మార్చురీ వద్ద బాధితుల బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. దంపతుల డెడ్​బాడీస్​ను చూసేందుకు  జనాలు పెద్ద ఎత్తున రావటంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  దీపిక కుటుంబాన్ని ఆదుకోవాలని నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎదురుగా రాస్తారోకో చేపట్టారు. ఇంకొందరు బంధువులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది