హై వోల్టేజ్ డ్రామా: బెల్టులు, డస్ట్‌బిన్లతో కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. వీడియో వైరల్..

హై వోల్టేజ్ డ్రామా: బెల్టులు, డస్ట్‌బిన్లతో కొట్టుకున్న రైల్వే సిబ్బంది.. వీడియో వైరల్..

గురువారం ఉదయం  5:45 గంటల సమయంలో  హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వెళ్లే 22470 నంబర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఐఆర్‌సిటిసి సిబ్బంది ఒకరినోకరు తీవ్రంగా కొట్టుకున్నారు. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో రైలు బయలుదేరే కంటే ముందే ఈ గొడవ జరిగింది.

ప్రస్తుతం ఈ గొడవ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైల్వే సిబ్బంది లెదర్ బెల్టులు, ప్లాట్‌ఫారమ్‌పై ఉండే  పబ్లిక్ డస్ట్‌బిన్లతో ఒకరినొకరు కొట్టుకోవడం కనిపిస్తోంది. ఒక వ్యక్తి  పబ్లిక్ డస్ట్‌బిన్ పట్టుకుని ఇంకో వ్యక్తిని కొడుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.

ఈ వీడియో పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే  22,500 మందికి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వైరల్ అయిన వీడియోపై నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఒక యూజర్ రైలు ప్రయాణికులను ఎంటర్టైన్ చేయడానికి ఐఆర్‌సిటిసి కొత్తగా ఈ ఫీచర్ పెట్టిందేమో అని కామెంట్ చేయగా... మరొక యూజర్ ఈ గొడవ ఎలా ఆగింది అసలు అని అన్నారు. 

మరొక యూజర్  ఇలా కొట్టుకోవడం కరెక్ట్ కాదు, ఇది రైలు సర్వీసుల పేరును చెడగొడుతుంది అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వైరల్ వీడియో గురించి ఐఆర్‌సిటిసి లేదా ఇండియన్ రైల్వే ఇంకా అధికారికంగా స్పందించలేదు.