V6 News

కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు 6767..మృతులు 147

కరోనా విజృంభణ.. 24 గంటల్లో కేసులు 6767..మృతులు 147

భారత్ లో కరోనా విజృంభిస్తుంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ఉదృతమవుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 6767 కేసులు నమోదవ్వగా..147 మంది చనిపోయారు. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మొత్తం 1,31,868 కి చేరగా మృతుల సంఖ్య 3867 చేరింది.  ప్రస్తుతం 54,440 మంది డిశ్చార్జ్ అవ్వగా మరో 73,560 మంది చికిత్స పొందుతున్నారు.అత్యధికంగా మహారాష్ట్రలో 47190 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 1577 మంది చనిపోయారు. ఆ తర్వాత గుజరాత్ లో 829 మంది  కరోనాతో చనిపోయారు