హయ్యెస్ట్​ మెజార్టీ 18,909.. అత్యల్ప మెజార్టీ 32 ఓట్లు

హయ్యెస్ట్​ మెజార్టీ 18,909..  అత్యల్ప మెజార్టీ 32 ఓట్లు

హైదరాబాద్, వెలుగు: ఎలక్షన్లలో రిజల్ట్స్​ ఒక్కోసారి ఊహించలేని విధంగా వస్తుంటయి. కొన్ని ఓట్లతోనే గెలుపోటములు అటూ ఇటూ మారిపోతాయి. ఈసారి గ్రేటర్‌‌‌‌ లోనూ అట్లాంటి సీన్​ కనిపించింది. కేవలం వెయ్యి ఓట్లలోపు తేడాతోనే 24 క్యాండిడేట్లు, వెయ్యికి కాస్త ఎక్కువ తేడాతో మరో ముగ్గురు క్యాండిడేట్లు విజయం సాధించారు. ఇందులో టీఆర్ఎస్​ నుంచి 11 మంది, బీజేపీ నుంచి 14 మంది, ఎంఐఎం క్యాండిడేట్​ఒకరు ఉన్నారు. మరోవైపు రికార్డు స్థాయి మెజారిటీతో మరికొందరు క్యాండిడేట్లు గెలిచారు. అందులో ఎక్కువగా ఎంఐఎం వాళ్లే ఉండగా.. బీజేపీ, టీఆర్ఎస్​ల నుంచి కొందరు ఉన్నారు.

హోరాహోరీ పోరులో..

బీఎన్ రెడ్డి నగర్​ డివిజన్​లో టీఆర్ఎస్​ క్యాండిడేట్​లక్ష్మీప్రసన్నపై బీజేపీ క్యాండిడేట్​లచ్చిరెడ్డి 32 ఓట్ల తేడాతో గెలిచారు. మచ్చ బొల్లారంలో బీజేపీ క్యాండిడేట్​ నరేశ్​పై టీఆర్ఎస్​ క్యాండిడేట్​ జితేంద్ర కేవలం 43 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీఆర్ఎస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరగడంతో దాదాపు ఇరు పార్టీల క్యాండిడేట్లకు దగ్గర దగ్గరగా ఓట్లు వచ్చాయి. దీంతో కొన్ని ఓట్ల తేడాతోనే క్యాండిడేట్లు గెలిచారు. ఎంఐఎం పాతబస్తీలోని డివిజన్లలో పూర్తిగా ఆధిక్యం చూపింది. 10కిపైగా డివిజన్లలో 10 వేల ఓట్లకుపైగా మెజార్టీ సాధించింది.

వెయ్యిలోపే ఓట్ల తేడా వచ్చిన డివిజన్లు

డివిజన్​                     గెలిచిన పార్టీ     మెజార్టీ

బీఎన్​రెడ్డి నగర్​              బీజేపీ             32

మచ్చబొల్లారం            టీఆర్ఎస్​           43

మల్కాజిగిరి                బీజేపీ             173

అడిక్​మెట్​                  బీజేపీ              227

హస్తినాపురం              బీజేపీ              279

వినాయక్​నగర్​            బీజేపీ              287

ఆల్విన్​ కాలనీ           టీఆర్ఎస్​           436

జగద్గిరిగుట్ట             టీఆర్ఎస్​            479

రామంతాపూర్​           బీజేపీ              487

రాంనగర్​                  బీజేపీ              529

మూసాపేట్​               బీజేపీ             538

మెట్టుగూడ            టీఆర్ఎస్​           584

చిలుకానగర్​           టీఆర్ఎస్​           612

వనస్థలిపురం            బీజేపీ           704

కూకట్​పల్లి              టీఆర్ఎస్​          749

జూబ్లీహిల్స్​               బీజేపీ           779

బంజరాహిల్స్​          టీఆర్ఎస్​         781

హబ్సిగూడ               బీజేపీ           789

మంగళ్ హాట్            బీజేపీ           809

జాంబాగ్​                  బీజేపీ           809

బౌద్ద నగర్​             టీఆర్ఎస్​     815

బన్సీలాల్​పేట్​         టీఆర్ఎస్​     836

సైదాబాద్               బీజేపీ           911

అత్యధిక మెజార్టీ వచ్చిన డివిజన్లు..

డివిజన్            పార్టీ             మెజార్టీ

పత్తర్​గట్టీ          ఎంఐఎం       18,909

తలాబ్​ చంచలం ఎంఐఎం        17,454

చాంద్రాయణగుట్ట ఎంఐఎం        16,733

కంచన్​బాగ్​       ఎంఐఎం       16,422

చావ్ని              ఎంఐఎం       11,778

అల్లాపూర్​         టీఆర్ఎస్​     10,310

చంపాపేట్​         బీజేపీ           9,008

హయత్​నగర్​   బీజేపీ           7,989

For More News..

అగ్రి చట్టాలను రద్దు చేస్తరా.. లేదా? ఎస్ ఆర్ నో

డాక్యుమెంట్లులేని విదేశీయులను దేశం నుంచి వెళ్లగొట్టొద్దు

గ్రేటర్‌లో గులాబీ అంచనాలు తలకిందులు