2020లో హైవే ప్రమాదాల్లో 48వేల మంది మృతి

2020లో హైవే ప్రమాదాల్లో 48వేల మంది మృతి
  • 2020లో హైవే ప్రమాదాలు
  • 48 వేల మంది మృతి
  • లోక్‌‌సభలో కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీ

న్యూఢిల్లీ:  నేషనల్‌‌ హైవేలు, ఎక్స్‌‌ప్రెస్‌‌ వేలపై నిరుడు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 47,984 మంది చనిపోయినట్లు కేంద్ర మంత్రి నితిన్‌‌ గడ్కరీ తెలిపారు. గురువారం లోక్‌‌సభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి గడ్కరీ సమాధానం ఇచ్చారు. అలాగే 2019లో హైవే, ఎక్స్‌‌ప్రెస్‌‌ వేలపై జరిగిన ప్రమాదాల్లో 53,872 మంది మరణించినట్లు వెల్లడించారు.

వెహికల్స్‌‌ డిజైన్‌‌, వాటి కండిషన్, రోడ్‌‌ ఇంజనీరింగ్‌‌, ఓవర్‌‌‌‌ స్పీడ్, డ్రంకెన్‌‌ డ్రైవ్‌‌, రాంగ్‌‌ సైడ్‌‌ డ్రైవింగ్‌‌, సిగ్నల్‌‌ జంపింగ్‌‌, డ్రైవ్‌‌ చేస్తూ మొబైల్‌‌ ఫోన్‌‌ వాడటం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. రోడ్‌‌ సేఫ్టీకి సంబంధించి కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను ఇష్యూ చేసినట్లు పేర్కొన్నారు. రోడ్లు డిజైన్‌‌ చేసేటప్పుడు..వేసేటప్పుడు ఇండిపెండెంట్‌‌ రోడ్‌‌ సేఫ్టీ ఎక్స్‌‌పర్ట్స్‌‌తో ఆడిట్ చేయిస్తామన్నారు.