
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో డబ్బులు ఇవ్వలేదని భక్తులపై హిజ్రాలు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. సోమవారం రాజన్న దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు రోడ్డు వెంట వెళ్తుండగా కొందరు హిజ్రాలు డబ్బులు ఇవ్వాలని అడ్డుకున్నారు.
ఆమె నిరాకరించడంతో చేయి చేసుకున్నారు. కుటుంబసభ్యులు వచ్చి నిలదీయగా వారిపైనా దాడికి యత్నించారు. దీంతో పక్కనే ఉన్న ఇతర భక్తులు హిజ్రాలతో వాగ్వాదానికి దిగారు. కాగా కొంతకాలంగా డబ్బు కోసం హిజ్రాలు తిట్టడం, కొట్టడం, శపించడం వంటివి చేస్తున్నారని భక్తులు చెబుతున్నారు. మరోవైపు బిచ్చగాళ్లతోనూ ఇబ్బందులు తప్పడం లేదని, అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.