రూ. 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి.. కేంద్రాన్ని కోరిన సీఎం

రూ. 2 వేల కోట్లు ఇచ్చి ఆదుకోండి.. కేంద్రాన్ని కోరిన సీఎం

భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన హిమాచల్ ప్రదేశ్ కు వెంటనే రూ. 2 వేల కోట్లు ఇవ్వాలని  ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుఖు కేంద్రాన్ని కోరారు.  రాష్ట్రంలో వరద బాధితులకు సహాయాన్ని పెంచుతామన్నారు.  గత వారంలో భారీ నుండి అతి భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు, రోడ్లు మూసుకుపోవడం వలన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిన సుఖ్‌విందర్ సింగ్..  తాత్కాలిక స‌హాయం కింద రాష్ట్రానికి రూ. 2 వేల కోట్ల రూపాయలను ఇవ్వాలని కోరారు.  

రాష్ట్రంలో వ‌ర్షాల వ‌ల్ల సుమారు నాలుగు వేల కోట్ల న‌ష్టం జ‌రిగి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు  సుఖ్‌విందర్ సింగ్. ప్రతి బాధిత కుటుంబానికి ల‌క్ష న‌ష్టప‌రిహారం ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. పరిహారాన్ని కూడా పెంచ‌ుతామని చెప్పారు.  ప్రస్తుతం ఒక్కో బాధితుడికి రూ. 5వేల చొప్పున ఇస్తున్నామని తెలిపారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్‌ను ఏర్పాటు చేశామ‌ని, త‌మ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల జీతాన్ని విరాళం ఇవ్వనున్నట్లుగా ఆయన వెల్లడించారు.  బీజేపీ ఎమ్మెల్యేలు కూడా దీనికి సహాకరించాలని కోరమన్నారు.

ALSO READ :ఏపీలో డ్రగ్స్ దందా.. గవర్నర్‌కు లోకేశ్‌ ఫిర్యాదు

  హిమాచల్ ప్రదేశ్‌లో 2023 జూన్ 26న రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 108 మంది మరణించగా 12 మంది గల్లంతయ్యారు. రాష్ట్ర ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ ప్రకారం, 667 ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా1,264  ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో 860కి పైగా రోడ్లు ఇప్పటికీ మూసుకుపోయాయి. హిమాచల్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ 994 రూట్లలో ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

 రాష్ట్రంలోని  తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురుస్తుంది. 2023 జూలై 18 వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రం 'ఎల్లో' అలర్ట్ జారీ చేసింది.