దళితులు జాగృతం కావాలి

దళితులు జాగృతం కావాలి

నారాయణపేట, వెలుగు: దళితులు జాగృతం అయితేనే హక్కుల సాధన సాధ్యమవుతుందని హైందవ పీఠాధిపతులు, ఎస్సీ పరిరక్షణ సమితి నాయకులు చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎస్సీ హక్కుల పరిరక్షణ సదస్సు నిర్వహించారు. సదస్సులో బీజ్వార్  పీఠాధిపతి ఆదిత్య పరశ్రి, శక్తి పీఠాధిపతి శాంతానంద్, ఎస్సీ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు దేవేంద్రప్ప, పాలమూరు యునివర్సిటీ ప్రొఫెసర్ కుమారస్వామి మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్  దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. 

రిజర్వేషన్  ద్వారా మత మార్పిడులు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతం మారినా రిజర్వేషన్  పొందుతూ అసలైన ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు దేశంలో అంబేడ్కర్  రాజ్యాంగం అమలు కావడం లేదన్నారు. ఇప్పటికైనా ఎస్సీలు జాగృతం కాకపోతే రాబోయే తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సీబీ వెంకటేశ్, బలరాం, వెంకటేశ్, లక్ష్మణ్, కంకప్ప, విజయ్ కుమార్, కృష్ణ పాల్గొన్నారు.