ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేశారా? ..HALలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

ఇంజినీరింగ్, డిగ్రీ పూర్తి చేశారా? ..HALలో భారీగా ఉద్యోగ అవకాశాలు!

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) ఏవియానిక్స్ విభాగం అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వాక్ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

పోస్టు పేరు: అప్రెంటీస్.
మొత్తం ఖాళీలు: 134.
విభాగాల వారీగా ఖాళీలు
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ (30): ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 16, మెకానికల్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 1, సివిల్ ఇంజినీరింగ్ 1, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 4.
జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (34): బి.కాం 15, బీఎస్సీ (ఎలక్ట్రానిక్స్) 10, బీఎస్సీ (కెమిస్ట్రీ) 2, బీఎస్సీ (కంప్యూటర్స్) 5, బీఎస్సీ (నర్సింగ్) 2.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ (68): ఎలక్ట్రానిక్స్ అండ్​ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ 35, మెకానికల్ ఇంజినీరింగ్ 15, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ 10, సివిల్ ఇంజినీరింగ్ 2, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ 4, ఎరోనాటికల్ ఇంజినీరింగ్ 2. 
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/ బి.టెక్, ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

ALSO READ : ఇండియన్ నేవీలో ఉద్యోగాలు
అప్లికేషన్ ప్రారంభం: మే 11.
వాక్​ఇన్ ఇంటర్వ్యూలు
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ – ఈసీఈ, సివిల్  & ఎరోనాటికల్ ఇంజినీరింగ్: జూన్ 2.
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ - ఈఈఈ, సీఎస్ఈ, సీఎస్ఈ & మెకానికల్ ఇంజినీరింగ్: జూన్ 3.
గ్రాడ్యుయేట్ జనరల్ స్ట్రీమ్స్: జూన్ 4.
డిప్లొమా టెక్నీషియన్స్: జూన్ 5. 
సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
మరిన్ని వివరాలకు వెబ్​సైట్ www.hal-india.co.inను చూడండి.