హిట్ సినిమా చేస్తానంటే చాలామంది భయపెట్టారు

హిట్ సినిమా చేస్తానంటే చాలామంది భయపెట్టారు

క్రైమ్, సస్పెన్షన్ జానర్‌‌లో తెరకెక్కిన సినిమా హిట్‌–2, సూపర్‌‌హిట్‌ టాక్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. మల్టీవర్స్‌ తరహాలో మొత్తం ఏడు సినిమాలతో దర్శకుడు శైలేష్‌ కొలను హిట్ వర్స్‌ని సృష్టించాడు. ఈ చిత్రంతో కథానాయకుడు అడివి శేష్‌కి మరొక బ్యాక్‌ టు బ్యాక్ హిట్‌ లభించింది. సినిమా సూపర్ హిట్ అవడంతో హైదరాబాద్‌లో చిత్ర బృదం సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన హీరో నాని తన అనుభవాల్ని ఇలా పంచుకున్నాడు.

‘‘కొత్త టాలెంట్‌ని గుర్తించాలి, విభిన్న చిత్రాలు చేయాలని ఈ ప్రొడక్షన్ హౌజ్‌ (వాల్‌ పోస్ట్‌ర్ సినిమా)ని ప్రారంభించా. హిట్–2 మొదలు పెట్టినప్పుడు చాలామంది ‘సీరియల్ కిల్లర్ తరహాలో చాలా సినిమాలు వచ్చాయి. హిట్‌ సినిమా స్టోరీలైన్‌లోనే హిట్–2 ఉంది. మళ్లీ అదే స్టీరీతో వచ్చే ఇలాంటి సినిమాల్ని ఎవరు చూస్తారు. ఇది అస్సలు వర్కౌట్ అవ్వదు. డబ్బులు పోగొట్టుకుంటావ’ని చాలామంది భయపెట్టారు. అయితే, నేను హిట్ వర్స్‌ని, శైలేష్‌ని నమ్మా. కథ మీద నమ్మకంతో ముందుకు వెళ్తున్న. ఆ నమ్మకమే ఇప్పుడు నిజం అయింద’’ని నానీ అన్నాడు. ఈ సక్సెస్ మీట్‌లో హిట్‌ హీరో విశ్వక్ సేన్‌, హిట్–2 హీరోలు అడివి శేష్, నానీ, డైరెక్టర్ శైలేష్ కొలను, హీరోయిన్‌ మీనాక్షీ చౌదరి పాల్గొన్నారు.