మెదక్​లో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తత.. అధికారులపై కారం చల్లబోయిన మహిళలు

మెదక్​లో ఇండ్ల కూల్చివేతతో ఉద్రిక్తత.. అధికారులపై కారం  చల్లబోయిన మహిళలు

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​లో గుడిసెలు, ఇండ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారితీసింది. స్థానిక హమాలీ కాలనీ వద్ద కొందరు పేదలు గుడిసెలు, ఇండ్లు నిర్మించుకొని ఉంటున్నారు. సోమవారం మున్సిపల్​అధికారులు, సిబ్బంది వచ్చి జేసీబీతో వాటిని కూల్చివేశారు.  ప్రభుత్వ భూమిలో నిర్మించుకోవడంతో నోటీసులిచ్చామని, అయినా పట్టించుకోకపోవడంతో కూల్చివేశామన్నారు. ఈ క్రమంలో జేసీబీని అడ్డుకోవడానికి మహిళలు ప్రయత్నించగా మెదక్​ టౌన్ ​సీఐ వెంకటేశ్ ​ఆధ్వర్యంలో పోలీసులు వారిని పక్కకు తప్పించి ఇండ్లను కూల్చివేశారు. 

కొందరు మహిళలు అధికారులపై కారం చల్లడానికి యత్నించగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో కమల అనే మహిళ స్పృహ కోల్పోగా పోలీసులు మెదక్​ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మున్సిపల్​ కమిషనర్ ​జానకీ రామ్​సాగర్​ మాట్లాడుతూ పట్టణంలో అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నా కూల్చివేస్తామన్నారు.