- కేకే ఓసీపీపై జెండా ఆవిష్కరణ
కోల్ బెల్ట్, వెలుగు: మందమరి ఏరియా కల్యాణిఖని ఓపెన్ కాస్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ చెల్లింపులో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని హెచ్ఎంఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆరోపించారు. శుక్రవారం ఓసీపీపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఇచ్చేవరకు తమ యూనియన్ పోరాటాలు చేస్తుందని భరోసా ఇచ్చారు. మహిళా ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు, కార్మికులు హెచ్ఎంఎస్ యూనియన్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
అంతముందు ఆయన గని ఆవరణపై యూనియన్ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మందమర్రి ఏరియా ఉపాధ్యక్షుడు బెడ్డల విజయ్ కుమర్, బెల్లంపల్లి రీజియన్ ఇన్చార్జ్ వెల్ది సుదర్శన్,సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ పార్వతి రాజిరెడ్డి, భువనచంద్ర, శ్రీనివాస్ రెడ్డి, శ్రీరాంపూర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి,సెక్రటరీ అశోక్, కేకే ఓసీపీ పిట్ సెక్రటరీ మౌనిక, నాయకులు మహేశ్, దుర్గం రామ్ చందర్, రతన్ సింగ్, సంతోష్, ప్రదీప్, అశోక్, వెంకటేశ్ పాల్గొన్నారు.
