న్యూఢిల్లీ: ఇండియా స్టార్ మిడ్‌ఫీల్డర్ హార్దిక్ సింగ్, విమెన్స్ టీమ్ స్ట్రయికర్ నవనీత్ కౌర్‌కు ప్రతిష్టాత్మక ‘హాకీ ఇండియా ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులు లభించాయి. శుక్రవారం జరిగిన ఈవెంట్లో సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ హార్దిక్, నవనీత్‌కు ‘బల్బీర్ సింగ్ సీనియర్’ అవార్డుతో పాటు చెరో రూ. 25 లక్షల నగదు అందించారు. గత ఏడాది కాలంలో అద్భుతంగా ఆడిన ప్లేయర్లను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.
1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన జట్టు సభ్యుడు, మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్‌కు ‘మేజర్ ధ్యాన్‌చంద్ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం.. రూ. 25 లక్షల నగదు బహుమతి అందజేశారు. బెస్ట్ గోల్ కీపర్‌గా బిచు దేవి ఖరీబమ్ (బల్బీర్ సింగ్ అవార్డు), బెస్ట్ డిఫెండర్, మిడ్‌ఫీల్డర్‌గా సంజయ్ నిలిచారు. సుఖ్‌జీత్ సింగ్‌కు ‘ఫార్వర్డ్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం దక్కింది. ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో సాధించిన విజయాలకు ప్రోత్సాహకంగా అబ్బాయిల జట్టుకు రూ. 1.38 కోట్లు, విమెన్స్ టీమ్‌కు రూ. 69 లక్షలు నగదును ఈ సందర్భంగా అందజేశారు. ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన మన్‌ప్రీత్ సింగ్ (400) రూ. 4 లక్షలు, హర్మన్‌ప్రీత్ సింగ్ (250) రూ. 2.5 లక్షల నగదు అందుకున్నారు.
